Bigg Boss Season 6 Day 8 First Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియకి సంబంధించి ప్రోమో కొద్ది నిమిషాల క్రితం విడుదల చేశారు. అయితే ప్రతి నామినేషన్ లో ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరినీ గతంలో నామినేట్ చేయడం జరిగింది. కానీ ఈసారి సోమవారం జరగబోయే నామినేషన్ ప్రక్రియలో ఒక్కో ఇంటి సభ్యుడు ఒక కంటెస్టెంట్ నీ మాత్రమే నామినేషన్ చేయాలని బిగ్ బాస్ సరికొత్త ట్విస్ట్ ఇంటి సభ్యులకు ఇచ్చారు. ఈ పరిణామంతో ఇంటి సభ్యుల మధ్య భారీగానే గొడవలు జరిగాయి.
ఆదిరెడ్డి వర్సెస్ ఆరోహి, శ్రీహాన్ వర్సెస్ గీతు రాయల్, గీతు రాయల్ వర్సెస్ నేహా చౌదరి.. అదేవిధంగా రేవంత్ కి కీర్తికి మధ్య కూడా గట్టిగానే పెద్ద గొడవ.. నామినేషన్ సమయంలో చోటుచేసుకుంది. సోమవారం జరగబోయే నామినేషన్ ప్రక్రియలో… ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగినట్లు ప్రోమోలో చూపించారు. మరి రెండవ వారం హౌస్ నుండి బయటకు వెళ్లడానికి ఎంత మంది నామినేట్ అయ్యారో సాయంత్రం ఎపిసోడ్ లో చూడాలి.
ఇంకా సుదీప కూడా గట్టిగానే తన నామినేషన్ సమయంలో రీజన్స్ చెప్పినట్లు సూర్య మీద సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ప్రోమో మొత్తం చూసుకుంటే ఆదిరెడ్డి.. తనదైన శైలిలో రీజన్స్ చెప్పినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆరోహితో పాటు రోహిత్..మెరీనా జంటతో ఆదిరెడ్డి గొడవ వేసుకున్నట్లు చూపించారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటివారం ఏడుగురు నామినేషన్ లో పెట్టి జనాల చేత ఓట్లు వేయించుకుని, ఎవరిని ఇంటి నుండి పంపించలేదు. దీంతో మొదటివారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రోసెస్ పై ఆదివారం ఎపిసోడ్ తర్వాత జనాల నుండి భారీగా విమర్శలు రావడం జరిగాయి.