Bigg Boss Season 6 Day 8 First Peomo: యధావిధిగా గత సీజన్ ల మాదిరిగానే సీజన్ సిక్స్ రెండో వారం నుండి సోమవారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సీజన్ సిక్స్ స్టార్ట్ అయ్యాక మొదటి వారంలో బుధవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరిగింది. దీంతో బుధవారం రోజు ఎలిమినేషన్ నామినేషన్ ప్రోసెస్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆదివారం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సోమవారం ఇంటి సభ్యుల మధ్య రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినట్లు చూపించడం జరిగింది.
నువ్వా నేనా అన్నట్టుగా.. ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ ల ప్రక్రియ సాగింది. ఈ ప్రక్రియలో ఆదిరెడ్డి సరైన పాయింట్లతో నామినేట్ చేసినట్లు ప్రోమోలో చూపించడం జరిగింది. ఇక ఇదే సమయంలో శ్రీహాన్ మొదటివారం కంటే కాస్త ఘాటుగా రెండో వారంలో నామినేషన్ ప్రక్రియలో విశ్వరూపం చూపించినట్లు గీతు రాయల్ పై సెటైర్లు వేసినట్లు చూపించారు. గీతు రాయల్ మొదటివారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో తప్పించుకోగా..రెండో వారం మాత్రం యధావిధిగా ఇంటి సభ్యులపై రెచ్చిపోయినట్లు.. నామినేట్ చేసినట్లు చూపించారు.

మొత్తం మీద చూసుకుంటే రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ.. ఇంటి సభ్యుల మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగినట్లు ఆదివారం ఎపిసోడ్ ప్రోమో చివరిలో చూపించడం జరిగింది. ఒక నూయ్యి ఇంకా ఇంటి సభ్యుల ఫోటో కలిగిన మట్టి కుండలు పెట్టారు. ఏ ఇంటి సభ్యుడిని అయితే నామినేట్ చేయాలని భావిస్తారో… ఆ ఇంటి సభ్యుడి ఫోటో కలిగిన మట్టి కుండా నూయ్యిలో వేసి రీజన్ చెప్పాల్సి ఉంటుంది. రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులు చాలా కుండలనే పగలగొట్టారు.
నోట్: బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం rtvmedia.in, Rtv Telugu ని సబ్‌స్క్రైబ్ చెయ్యండి!