Bigg Boss Season 6 Day 8 Episode Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ సోమవారం ఎపిసోడ్ లో రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే.. జస్ట్ మిస్ లో సేవ్ అయినా సుల్తానాతో.. కీర్తి, శ్రీ సత్య కొద్దిగా మాట్లాడటానికి ట్రై చేశారు. ఆ తర్వాత ఆదిరెడ్డి గార్డెన్ ఏరియాలో.. రేవంత్ తో డిస్కషన్ పెట్టారు. ఇంటి సభ్యులందరూ ఒకే కారణంతో మీపై చెబుతున్న కారణాలను గుర్తుపెట్టుకోవాలని ఆదిరెడ్డి సూచించారు. మీరు చాలా స్ట్రాంగ్ అంటిస్టెంట్. కచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత స్ట్రాంగ్ అవుతారు అని కొన్ని సూచనలు ఇచ్చారు. నాకు మీలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లతో గేమ్ ఆడాలంటే చాలా ఇష్టమని ఆదిరెడ్డి.. రేవంత్ తో చెప్పుకొచ్చాడు. శ్రీ సత్యకి సంబంధించిన మ్యాటర్ విషయంలో మళ్ళీ రేవంత్ కి.. అర్జున్ కళ్యాణ్ కి మధ్య గొడవ జరిగింది.
ఆదివారం ఎపిసోడ్ లో ఆరోహీ.. వ్యవహరించిన తీరుపై సూర్య… చంటి ఇంకా అభినయశ్రీతో డిస్కషన్ పెట్టడం జరిగింది. దీంతో సూర్యకి ఆరోహి మధ్య వార్ కంటిన్యూ కావటంతో సూర్య మైక్ ఆరోహి దాసేసింది . సూర్య తనతో మాట్లాడాలని ఆరోహి ఈ రీతిగా చేసింది. అయితే సూర్య అనుకోకుండా సుల్తాన్ మైక్ ధరించాడు. దాదాపు గంటసేపు సుల్తానా తన మైక్ కోసం వెతకడంతో చివర ఆఖరికి సూర్య దగ్గర దొరికింది. దీంతో సుల్తానా సీరియస్ అయ్యి హౌస్ కెప్టెన్ బాలాదిత్య వద్దకు వెళ్లి సూర్యకి పనిష్మెంట్ ఇవ్వాలని.. తన బాధ మొత్తం చెప్పుకుంది. అనంతరం ఆరోహి.. సూర్య మైక్.. అతనికి తెలియకుండా శ్రీహాన్ కి ఇచ్చి .. ఇప్పించేసింది. ఆ తర్వాత మళ్లీ సూర్యకి ఆరోహిమధ్య చిన్నపాటి గొడవ జరిగింది. తర్వాత ఇద్దరూ మాట్లాడుకుని కలిసిపోయారు. ఆ తర్వాత అర్ధరాత్రి సూర్య, ఆరోహి, ఫైమా, రాజ్ ఈ నలుగురు కిచెన్ లో ఎవరికి తెలియకుండా కొన్ని ఐటమ్స్ చేసుకొని తినడం జరిగింది.
తర్వాత ఉదయం సాంగ్ కి అందరూ డాన్స్ చేశారు. అనంతరం చంటి, శ్రీహన్, సూర్య ముగ్గురు కలిసి గార్డెన్ ఏరియాలో సిట్టింగ్ పెట్టి ఇంటి సభ్యులపై జోకులు వేసుకున్నారు. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటి సభ్యుడు చాలా జాగ్రత్తగా గేమ్ ఆడాలని నామినేషన్ చేయాలని బిగ్ బాస్ ఆదేశాలిచ్చారు. నామినేషన్ చేసే కంటెస్టెంట్ యొక్క ఫోటో కుండకి అతికించి పక్కనే ఉన్న బావిలో వేయాలని తెలిపారు. ముందుగా ఆరోహి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసింది. ఆరోహి.. సరిగ్గా ఇద్దరి మధ్య బాండింగ్ లేదని ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. ఆ తర్వాత శ్రీహాన్ బాత్రూమ్ దగ్గర మగాళ్ళందర్నీ కలిపి గీతు తిట్టిందన్న కారణం పై నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫైమా ఆదివారం ఎపిసోడ్ లో తనని తిట్టడంపై రేవంత్ నీ నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆదిరెడ్డి వచ్చి.. ఇతర కంటెస్టల కంటే రోహిత్.. మెరీనాకి అన్ని రకాలుగా స్ట్రెంత్ హౌస్ లో ఉందని వాళ్ళిద్దరిని నామినేట్ చేశారు. తర్వాత అర్జున్ వచ్చి.. కొన్ని లిమిట్స్ దాటడం మాత్రమే కాదు కోపంగా కూడా మాట్లాతున్నావు అంటూ రేవంత్ నీ నామినేట్ చేయడం జరిగింది. నేహా చౌదరి.. ఏదైనా కంప్లైంట్స్ పాయింట్స్ చెప్పే విషయంలో మాట తీరు బాలేదని గీతునీ నామినేట్ చేయడం జరిగింది. అనంతరం చంటి వచ్చి మాట తీరు విషయంలో గీతునీ నామినేట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ రోహిత్ మెరీనా ఇద్దరు.. తమని సిల్లీ రీజన్ తో నామినేట్ చేశారని ఆదిరెడ్డిని.. నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీ సత్య, అభినయశ్రీ… షానీనీ నామినేట్ చేయడం జరిగింది. సుదీప.. వచ్చి గీతుని నామినేట్ చేయడం జరిగింది. సూర్య కూడా గీతూనే నామినేట్ చేశాడు. నెక్స్ట్ కీర్తి వచ్చి.. రేవంత్ నీ నామినేట్ చేసింది. ఆ తర్వాత రాజశేఖర్ కూడా గట్టిగానే రేవంత్ తో డిస్కషన్ పెట్టి నామినేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో గీతు.. ఇటువంటి రాజశేఖర్ మాకు కావాలి అని డైలాగ్ వేయటం హైలెట్.
Bigg Boss Season 6 Day 8 Episode Review: నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కంగారు పడకు బయటకు వెళ్లవు
అనంతరం రేవంత్ వచ్చి.. గీతు మాట తీరుపై ఇంకా అనేక విషయాలపై గట్టిగానే వాదనలు చేసి.. నామినేట్ చేయడం జరిగింది. అనంతరం సుల్తానా వచ్చి ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. నెక్స్ట్ షానీ…అభినయ శ్రీనీ నామినేట్ చేయడం జరిగింది. వాసంతి చాలా సిల్లీ రీజన్ తో…చూస్తే నవ్వడం లేదని పైమాని నామినేట్ చేసింది. గీతు..రేవంత్ ని నామినేట్ చేసింది. ఆ తర్వాత కెప్టెన్ బాలాదిత్యకి.. ఇద్దరినీ నామినేట్ చేసే పవర్ బిగ్ బాస్ ఇవ్వటంతో షాని, రాజ్ నీ నామినేట్ చేయడం జరిగింది. రెండో వారం నామినేషన్ ప్రక్రియ అయిన వెంటనే రేవంత్, అర్జున్, రాజశేఖర్, ఫైమా డిస్కషన్ పెట్టడం జరిగింది. ఇక సిల్లీ రీజన్ తో… తనని నామినేట్ చేసిన వాసంతి దగ్గర ఫైమా డిస్కషన్ పెట్టింది. కచ్చితంగా నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కంగారు పడకు బయటకు వెళ్లవు అంటూ వాసంతి… ఫైమాకి వివరణ ఇచ్చింది. మొత్తం మీద రెండో వారం హౌస్ నుండి ఎలిమినేట్ కావటానికి నామినేట్ అయిన సభ్యులు గీతు, రేవంత్, ఆదిరెడ్డి, షాని, రాజ్, రోహిత్.. మెరీనా, అభినయశ్రీ, ఫైమా.. 8 మంది నామినేట్ కావటం జరిగింది.