Bigg Boss Season 6 Day 7 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ కాకపోవడంతో హౌస్ మేట్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా మొదటి వారం హౌస్ లో అందరికంటే ఎక్కువగా సుల్తానాకి రోజు షాకుల మీద షాకులే తగిలాయి. గీతు రాయల్ బాత్రూం గొడవ దగ్గర నుండి చాలామంది ఆమెను టార్గెట్ చేసినట్లు హౌస్ లో పరిస్థితులు మారాటంతో సుల్తానా బాగా ఫ్రస్ట్రేషన్ కి గురికావడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే హౌస్ ఉండి ఎలిమినేట్ అవ్వడానికి ఆదివారం ఎపిసోడ్ కి మొత్తం ఐదుగురు మిగలటం తెలిసిందే.
అయితే ఈ ఐదుగురిలో ఇద్దరూ స్టార్టింగ్ లో సేఫ్ అయ్యారు. దీంతో చివర ఆఖరికి ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఆరోహి, సుల్తానా, అభినయశ్రీ. ఈ క్రమంలో ఈ ముగ్గురిపై ఇంటిలో ఉన్న మిగతా సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేయాలని నాగార్జున కోరడం జరిగింది. ఇంటిలో దాదాపు 14 మంది సుల్తానాకి వ్యతిరేకంగా నెగిటివ్ కామెంట్ చేశారు. దీంతో సుల్తానా ఈ ప్రోసెస్ అనంతరం… తన బెడ్ దగ్గరికి వెళ్లిపోయి ఏడ్చేసింది. అయితే 14 మందిలో ఎక్కువగా చాలామంది అనవసరమైన విషయంలోకి సుల్తానా మొదటి వారంలో చాలా సార్లు వచ్చిందని కారణం చెప్పారు.
ఇద్దరికీ డిస్కషన్ జరుగుతున్న సమయంలో వేరే వ్యక్తిని, పరిస్థితులను డిస్కషన్ లోకి తీసుకొస్తుందని కూడా తెలియజేయడం జరిగింది. ఫ్రస్టేషన్ కి గురై… ఏది పడితే అది మాట్లాడేస్తుందని మరికొంతమంది.. సుల్తానాకి వ్యతిరేకంగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఈ ప్రోసెస్ అనంతరం ఒక్కసారిగా సుల్తానా నిరోత్సాహానికి గురి అయిపోయింది. అయినా గాని ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా గాని సుల్తానా మాత్రం ఎలిమినేట్ కాకుండా అదృష్టవశాత్తు హౌస్ లో కొనసాగుతూ ఉండటం విశేషం.
నోట్: బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం rtvmedia.in, Rtv Telugu ని సబ్‌స్క్రైబ్ చెయ్యండి!