Bigg Boss Season 6 Day 7 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి కూడా లీక్ వార్తలు బెడద స్టార్ట్ అయ్యింది. గత సీజన్లలో నామినేషన్ సమయంలో ఇంకా ఇంటి నుండి ఎవరు బయటకు వస్తున్నారు అనేదానిపై ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వకముందే సోషల్ మీడియాలో అన్ని వివరాలు బయటకు వచ్చేసేవి. ఆదివారం ఎపిసోడ్ లో హౌస్ లో ఎవరూ కూడా ఎలిమినేట్ అవ్వడంలేదని వార్తలు వచ్చాయి. అదే తరహాలో ఆదివారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ కాలేదు.

కాగా ఇప్పుడు సోమవారం ఎలిమినేషన్ కి సంబంధించిన ప్రక్రియ వివరాలు మొత్తం అన్ని బయటకు వచ్చేసాయి. రెండో వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యుల వివరాలు మొత్తం ఎనిమిది మంది. రెండో వారం ఇంటి నుండి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన ఆ ఎనిమిది మంది పేర్లు చూస్తే.. రేవంత్, రోహిత్ .. మెరీనా జంట, ఫైమా, అభినయ్ శ్రీ, ఆదిరెడ్డి, గీతు, షానీ, రాజశేఖర్. కాగా రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో ఆదిరెడ్డి మాట్లాడిన విధానం చాలా హైలెట్ అయినట్టుగా ఉంటుందని సమాచారం.

ఈ క్రమంలో డిస్కషన్ చేసే సమయంలో గట్టిగానే గొడవలు జరిగాయని కూడా అంటున్నారు. ఏది ఏమైనా నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో మొత్తం ఎనిమిది మంది ఇంటి నుండి బయటకు వెళ్లడానికి నామినేట్ అయినట్లు లీక్ వీరుల నుండి అందుతున్న సమాచారం.
నోట్: బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం rtvmedia.in, Rtv Telugu ని సబ్‌స్క్రైబ్ చెయ్యండి!