Bigg Boss Season 6 Day 7 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటివారం ఎలిమినేషన్ కి సంబంధించి ఎవరిని హౌస్ నుండి బయటకు పంపలేదు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో అందరూ సేఫ్ జోన్ లో ఉన్నట్లు చాలా సస్పెన్స్ గా.. ఎపిసోడ్ ని రక్తి కట్టించారు. మొదటివారం ఇంటి నుండి ఎలిమినేట్ కావడానికి ఏడుగురు నామినేట్ కావటం తెలిసిందే. ఏడుగురులో శనివారం ఎపిసోడ్ లో ఇద్దరు సేఫ్ జోన్ లోకి వెళ్లారు. మిగతా ఐదుగురిని ఆదివారం ఎపిసోడ్ లో ఒక్కొక్కరిని సేఫ్ గా ప్రకటిస్తూ వచ్చారు. ఇక చివరిలో అభినయశ్రీ.. సుల్తానా ఉండడం జరిగింది. అయితే ఈ ఇద్దరిలో ఒక ఎలిమినేట్ అవుతారని అందరూ భావించగా… ఇద్దరు సేఫ్ గానే ఉండటం జరిగింది.

దీంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు చేసిన తీరుపై ఆడియన్స్ నుండి విమర్శలు వస్తున్నాయి. ఎలిమినేషన్ లేనప్పుడు ఓటింగ్ దేనికి పెట్టారని ప్రశ్నిస్తున్నారు. అదేదో ఇంటి సభ్యులనే సస్పెన్స్ లో ఉంచి.. బయట ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేయకుండా హిందీ బిగ్ బాస్ మాదిరిగా చేయొచ్చు కదా అంటూ ఆడియన్స్ సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిణామంతో సీజన్ సిక్స్ లో ఆడియన్స్ ని ఫూల్స్ చేశారన్న విమర్శలు గట్టిగా వస్తున్నాయి.
మొదటివారం ఎలిమినేషన్ ప్రక్రియ లేకుండా ఉండే ప్లాన్ చేసినప్పుడు ప్రేక్షకులను టెన్షన్ పెట్టడం దేనికి.. ఓట్లు ఎందుకు వేయించుకున్నారు అంటూ షో నిర్వాహకులపై జనాలు విమర్శలు చేస్తూ ఉన్నారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ లలో ఫస్ట్ టైం మొదటివారం ఎటువంటి ఎలిమినేషన్ లేకపోవడం. ఇదిలా ఉంటే సోమవారం ఎపిసోడ్ కి సంబంధించి ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ నువ్వా నేనా అన్నట్టుగా ఇంటి సభ్యుల మధ్య జరిగినట్లు ప్రోమోలో చూపించారు.