Bigg Boss Season 6 Day 7 First Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించి రెండో ప్రోమో రిలీజ్ అయింది. ఈ క్రమంలో ఇంటి సభ్యులందరికీ “ఐటెం నెంబర్” అనే టాస్క్ ఇవ్వడం జరిగింది. ఐటెం సాంగ్ లకు సంబంధించిన వస్తువులు నాగార్జున చూపించారు. ఆ పాటను గుర్తుపట్టాలని..పాడాలని పేర్కొన్నారు. దీంతో ఈ టాస్క్ కి ఇంటి సభ్యులను కొన్ని గ్రూపులుగా విభజించారు. ఇక ఇదే సమయంలో పాట కనిపెట్టిన సభ్యులు ఆ పాటకి డ్యాన్స్ కూడా వేయాల్సి ఉంటుంది.
ఈ పరిణామంతో రివ్యూలు చెప్పే ఆదిరెడ్డిని ..మొట్టమొదటిసారి నాగార్జున డాన్స్ వేయించడం జరిగింది. ఆదిరెడ్డి డాన్స్ కి ఇంటి సభ్యులందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి నామినేషన్ లో ఉన్న ఐదుగురు సభ్యులను చివరిలో నాగార్జున లేవనెత్తడం జరిగింది. దీంతో ఐదుగురిలో ఎవరు సేఫ్ అయ్యారు అన్నది చాలా సస్పెన్స్ లో పెట్టి ఆదివారం ఎపిసోడ్ రెండో ప్రోమో క్లోజ్ చేయడం జరిగింది.
దీంతో ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే షోలో ఈ ఐదుగురిలో ఎవరు ఇంటి నుండి వెళ్తారో చూడాలి. రేవంత్, ఫైమా, సుల్తానా, అభినయశ్రీ, ఆరోహి డేంజర్ జోన్ లో ఉన్నారు. ఓటింగ్ పరంగా రేవంత్, ఫైమాకి భారీగానే ఓట్లు పడ్డాయి. మరి మిగతా ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి అని అంటున్నారు.