Bigg Boss Season 6 Day 6 Second Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ శనివారం ఎపిసోడ్ కి సంబంధించి రెండో ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో నాగార్జున కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకుడిగా ఉన్న ఫైమా నీ అభినందించారు. చాలా కరెక్ట్ గా ఫైమా .. సంచాలకుడిగా రాణించిందని పొగడ్తలతో ముంచెత్తారు. ఒక నాగార్జున మాత్రమే కాదు.. స్టూడియోలో ఉన్న ఆడియన్స్ తో కూడా చప్పట్లు కొట్టించారు. అనంతరం కీర్తి నీ పిచ్చి అంటూ చాలా ముద్దుగా నాగార్జున పిలవడం జరిగింది. హౌస్ లో ఎవరికోసమో బ్రో అని పిలవాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టం వచ్చినట్లు పిలుచుకోవచ్చు.
ఆ తర్వాత శ్రీ సత్య నీ చక్కగా ఇంటిలో ఉన్నట్టు తింటూ తిరుగుతూ అని వ్యాఖ్యలు చేయగా వెంటనే శ్రీ సత్య.. సార్ హౌస్ లో ఫుడ్ సరిపోవటం లేదని తన బాధను చెప్పుకుంది. అనంతరం సుల్తానా సరిగ్గా గేమ్ ఆడటం లేదని నాగార్జున గట్టిగానే ఇన్ డైరెక్టుగా క్లాస్ పీకారు. ఇంకా నా ఇంటిలో ఉన్నట్టు హౌస్ లో ఇష్టానుసారంగా ఉంటా, పనులు చేయను అని చెప్పే కంటెస్టెంట్లకు కూడా నాగార్జున గట్టిగా క్లాస్ తీసుకున్నారు.
చంటి ఆట తీరుపై కూడా చివాట్లు పెట్టడం జరిగింది. ఆ తర్వాత శ్రీహాన్ నీ బయట వాళ్ళ సపోర్ట్ అటువంటిదేమీ ఉండదు. ఆడియన్స్..కి నచ్చితేనే హౌస్ లో ఉంటారు. ఇది అందరికీ వర్తిస్తుంది అని ఇన్ డైరెక్ట్ గా సిరి ప్రస్తావనకి నాగార్జున కౌంటర్ ఇచ్చారు. ఏది ఏమైనా సీజన్ సిక్స్ ఫస్ట్ వీకెండ్ .. ఎపిసోడ్ లో నాగార్జున తనదైన శైలిలో కొంతమందికి వార్నింగ్ లు ఇవ్వగా మరి కొంతమంది నీ పొగడ్తలతో ముంచెత్తారు.