Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ శనివారం జరిగిన ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ ఆట తీరు పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ క్రమంలో కొంతమందికి పొగడ్తలు మరి కొంతమందికి వార్నింగ్ లు ఇచ్చారు. ఇంకా హౌస్ లో కొత్తగా గేమ్ ఆడకుండా ఉంటున్నా వారిని.. ఆడాలని తనదైన శైలిలో పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుండి మొదటివారం ఏడుగురు ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది.
రేవంత్, సుల్తానా, అభినయశ్రీ, ఆరోహి, శ్రీ సత్య, చంటి, ఫైమా. ఈ ఏడుగురిలో శనివారం ఎపిసోడ్ లో శ్రీ సత్య, చంటి సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. మిగతా ఐదుగురిలో ఆదివారం ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలిపారు. దీంతో రేవంత్, సుల్తానా, ఫైమా, అభినయశ్రీ, ఆరోహి లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది. చాలావరకు అభినయశ్రీ ఇంటి నుండి వెళ్ళిపోయే అవకాశం ఉందని బయట గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఓటింగ్ పోల్ లో మొదటి నుండి అభినయశ్రీకి.. సుల్తానాకి మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది.
దీంతో ఇద్దరిలో ఎక్కువగా అభినయశ్రీ హౌస్ నుండి వెళ్లే ఛాన్సెస్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క మొదటివారం డబుల్ ఎలిమినేషన్ కి అవకాశాలు కూడా ఉన్నాయని బయట ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఏకంగా 21 మంది సభ్యులు ఉండటంతో.. తొలివారం ఇద్దరూ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. మరి ఆదివారం జరగబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.