Bigg Boss 6: గత రెండు సీజన్ లలో బయట కరోనా కారణంగా బిగ్ బాస్ షో ఆడియన్స్ లేకుండా రన్ చేయడం జరిగింది. సీజన్ 4 అదేవిధంగా సీజన్ 5లో బిగ్ బాస్ హౌస్ లోకి వీకెండ్ ఎపిసోడ్ టైంలో ఆడియన్స్ నీ రాణించలేదు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించి వీకెండ్ ఎపిసోడ్ లో ఆడియన్స్ రావడం జరిగింది. ఈ పరిణామం గురించి నాగార్జున మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా సంవత్సరాల తర్వాత బిగ్ బాస్ షోలో ఆడియన్స్ వచ్చారని.. చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
అంతేకాకుండా తన యాంకరింగ్ కి ఆడియన్స్ యే ఎనర్జీ అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఫస్ట్ వీకెండ్ సీజన్ సిక్స్ కి వచ్చిన ఆడియన్స్ కి నాగార్జున ఒక ప్రశ్న వేయడం జరిగింది. అదేమిటంటే గీతు రాయల్ నీ జైలుకు పంపించడం కరెక్టా? కాదా ? అని ప్రశ్నించారు. వచ్చిన ఆడియన్స్ లో దాదాపు 90 శాతం మంది కరెక్ట్ అని తెలియజేశారు. కారణాలు కూడా చెప్పుకొచ్చారు. తోటి కంటెస్టెంట్ లపై… ఇష్టానుసారంగా మాటలు విసిరేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరితో గొడవలు పడే విధంగా వ్యవహరిస్తుందని ఆమెకు జైలు శిక్ష విధించటం కరెక్టే అని స్పష్టం చేశారు.
ఇక ఇదే సమయంలో వీకెండ్ ఎపిసోడ్ లో గీతు రాయల్ కి అనేక విషయాలలో నాగార్జున సైతం క్లాస్ తీసుకోవడం జరిగింది. ఇష్టానుసారంగా ఎవరి పైన పడితే వారిపై మాట్లాడకూడదని అన్నారు. ఇదే సమయంలో మనం ఇతరులకు చెప్పే ముందు మనం కూడా పనులు చేయాలి. మనం పాటించకుండా ఇతరులకు చెబితే ఏం లాభమని గట్టిగానే గీతుకి నాగార్జున క్లాస్ తీసుకోవడం జరిగింది. గేమ్ పరంగా బాగానే ఆడుతున్నా గానీ మాట తీరు మార్చుకోవాలని సూచించారు.