Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన నాటినుండి హౌస్ లో అందరూ ఒకలా వ్యవహరిస్తుంటే ఆదిరెడ్డి, గీతు రాయల్ మరోలా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ ఇంటి సభ్యులతో ఎక్కువగా కలవకుండా.. ఇంటి సభ్యుల గురించి రకరకాల చర్చలు పెట్టుకుంటూ ఉన్నారు. జైల్లో గీతు ఉన్న సమయంలో కూడా.. ఆదిరెడ్డి హౌస్ లో ఉన్న సభ్యుల గురించి మాట్లాడుతూ కెమెరాలకు చిక్కడం శనివారం ఎపిసోడ్ లో కనిపించింది.
ఈ క్రమంలో శనివారం వీకెండ్ ఎపిసోడ్ నేపథ్యంలో ఇంటిలో ఉన్న సభ్యులందరికీ కొన్ని జాగ్రత్తలు చెబుతూన్నే కొంతమందికి వార్నింగులు కూడా హోస్ట్ నాగార్జున ఇవ్వటం జరిగింది. దీనిలో భాగంగా ఆదిరెడ్డి హౌస్ లో ఆడుతున్న ఆట తీరు పట్ల నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. బయట రివ్యూలు ఇచ్చి బాగా అలవాటు పడిపోయావు. ఇప్పుడు నీ గురుంచి బయట రివ్యూలు రాస్తున్నారు.
హౌస్ లో గేమ్ ఆడాలి కదా అంటూ సెటైర్లు వేశారు. ఆటలాడుతున్న సమయంలో ఆటలో ఆటగాళ్లు ఉంటారా?, ఎంపైర్ లు ఉంటారా..? అని ప్రశ్నించారు. దానికి ఆదిరెడ్డి ఆటగాళ్లు అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత నాగ్ గట్టిగా క్లాస్ తీసుకుని గేమ్ ఆడమని ఆదిరెడ్డికి తెలిపారు. ఇదే సమయంలో ఇతరుల ఆట తీరు గురించి రివ్యూలు ఇవ్వోద్దు ఎందుకంటే దాని వల్ల ఇతరుల గేమ్ స్లో అయ్యే అవకాశం ఉంది అంటూ నాగార్జున తనదైన శైలిలో చెప్పారు. ఇంకా ఆదిరెడ్డి పేరును ఉడల్ మామగా మార్చినట్లు… తాను ఆ పేరుతోనే రానున్న రోజులో పిలవనున్నట్లు నాగార్జున చెప్పుకొచ్చారు.