Bigg Boss Season 6 Day 5 Second Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఐదో రోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో హౌస్ వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనేది ఇంటి సభ్యులందరూ చర్చించి తెలియజేయాలని బిగ్ బాస్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో హౌస్ మేట్స్ సోఫా రూమ్ లో జరిగిన డిస్కషన్ లో చాలామంది ఇంటి సభ్యులు..గీతు రాయల్ నీ వరస్ట్ కంటెస్టెంట్ గా తెలియజేస్తూ ఆమె ముఖం పై స్టాంపులు వేశారు. అర్జున్, రోహిత్ మెరీనా, చంటి, వాసంతి.. ఇంకా చాలామంది గీతు రాయల్ వరస్ట్ కంటెస్టెంట్ గా తెలియజేసినట్లు ప్రోమోలో చూపించారు.
ఈ ప్రక్రియలో యధావిధిగా ఆదిరెడ్డి… సింగర్ రేవంత్ ని టార్గెట్ చేసి డబల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడినట్లు రీజన్ చెప్పి వరస్ట్ కంటెస్టెంట్ గా స్టాంప్ వేయడం జరిగింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య గట్టిగానే డిస్కషన్ జరిగింది. ఇక కెప్టెన్సీ టాస్క్ లో గీతు రాయల్..కి మిగతా ఇంటి సభ్యులకు మధ్య గట్టిగానే గొడవలు జరిగినట్లు ప్రోమోలో చూపించారు. ఇక బాలాదిత్యా.. తనని అర్థం చేసుకోలేదని డైలాగ్ వేసిన సుల్తానాకి వరస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు.
చివరిలో సుల్తానా వచ్చి శ్రీహాన్ తో.. డిస్కషన్ చేస్తూ నీకు బయట సిరి ఉంది. నేను సింగిల్..గా హౌస్ లో గేమ్ ఆడుతున్నాను అంటూ ఫ్రస్టేషన్ గా మాట్లాడటం జరిగింది. దీంతో శ్రీహాన్ బయట వాళ్ల పేర్లు ఎత్తొద్దు అంటూ చాలా సీరియస్ గా.. సుల్తానా కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. మొత్తం మీద ఐదో రోజు ఎపిసోడ్ లో గట్టిగానే హౌస్ లో గొడవలు జరిగినట్లు.. రెండో ప్రోమోలో చూపించారు.