Bigg Boss Season 6 Day 5 Leak News: బిగ్ బాస్ సీజన్ సిక్స్ నేడు ఐదో ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కెప్టెన్సీ టాస్క్ ఇవ్వడం జరిగింది. సీజన్ సిక్స్ హౌస్ కి మొట్టమొదటి కెప్టెన్ అవటానికి ఇంటి సభ్యులు గట్టిగానే పోటీ పడటం ప్రోమోలో కనిపించింది. సంచాలకుడిగా ఫైమా రాణిస్తోంది. ఈ క్రమంలో కొంతమంది కంటెస్టెంట్ల మధ్య గొడవలు కూడా జరిగినట్లు చూపించారు.

ఇదంతా పక్కన పెడితే ప్రతి సీజన్ మాదిరిగానే ఈసారి సీజన్ సిక్స్ లో కూడా ఎపిసోడ్ ప్రసారం కాకముందే లీక్ వార్తలు బయటకు వచ్చేస్తున్నాయి. నాలుగు ఎపిసోడ్ లో రేవంత్ వర్సెస్ ఆరోహి మధ్య గొడవ జరుగుతున్నట్లు.. నిన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఐదో ఎపిసోడ్ కి సంబంధించి కెప్టెన్సీ గా బాలాదిత్య సెలెక్ట్ కావడం జరిగిందట. ఇంకా వరస్ట్ పెర్ఫార్మర్ గా గీతు రాయల్ కి ఇంటిలో ఉన్న సభ్యులు ఎక్కువ ఓట్లు వేసి ఆమెను జైలుకు పంపించడం జరిగింది అంట.

సో ఆరో సీజన్ కి సంబంధించి లీక్ వార్తల ప్రకారం సీజన్ సిక్స్ మొట్టమొదటి కెప్టెన్ బాలాదిత్య అని టాక్. ప్రోమోలో బిగ్ బాస్.. కెప్టెన్ కావడానికి ఇంటి సభ్యులకు “కెప్టెన్సీ బండి” అనే టాస్క్ పెట్టడం జరిగింది. అయితే ఈ టాస్క్ లో బాలాదిత్య గెలిచినట్లు లీక్ వార్తలు బట్టి తెలుస్తోంది. బాలాదిత్య గెలవడం పట్ల మిగతా ఇంటి సభ్యులకు కూడా సంతోషంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.