Bigg Boss Season 6 Day 5 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన నాటి నుండి కంటెస్టెంట్ ఇనయా సుల్తానాకి చాలామందితో గొడవలు అవుతూనే ఉన్నాయి. ఎపిసోడ్ స్టార్టింగ్ లో గీతు రాయల్.. బాత్రూంలో వెంట్రుకలు..సుల్తానా పై గొడవకు దిగిన నాటినుండి.. వరుస పెట్టి సుల్తానాకి హౌస్ లో షాక్ లు మీద షాక్ లు తగులుతూన్నే ఉన్నాయి. ఆ తర్వాత సుల్తానా ట్రాష్ గ్రూప్ లో వెళ్లటం.. అదే సమయంలో రెండు టాస్కులు ఓడిపోవడంతో పాటు నేరుగా మొదటి వారం ఎలిమినేషన్ కి నామినేట్ కావటం జరిగింది.
దీంతో ఫ్రస్టేషన్ కి గురైన ఇనయా సుల్తానా అప్పటినుండి ఎవరితో పడితే వాళ్లతో గొడవలు పెట్టేసుకుంటూ ఉంది. ప్రారంభంలో ఆదిరెడ్డి తో.. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియలో ఆరోహితో గొడవ పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఐదో రోజు ఎపిసోడ్ లో వరస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రక్రియలో ఇనయా సుల్తానా మరింత ఫ్రస్టేషన్ కి గురై.. కొత్త కెప్టెన్ బాలాదిత్యతో నేహా చౌదరి ఇంకా శ్రీహాన్ తో గొడవలు పెట్టేసుకుంది. ఇష్టానుసారమైన స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ సుల్తానా ఐదో రోజు ఎపిసోడ్ లో రచ్చ రచ్చ చేసింది. తనకి ఎవరూ లేరు.. మిగతా ఇంటి సభ్యులందరికీ బయట ఫాలోయింగ్ ఉంది అనే తరహాలో సింపతి గేమ్ ప్లే చేసే రీతిలో వ్యవహరించింది.
శుక్రవారం అర్ధరాత్రి ఓటింగ్ ప్రక్రియ ముగిసే టైం కావటంతో చాలా తెలివిగా సుల్తానా వరస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రక్రియలో సింపతీ డైలాగులు వేసింది. ఇదిలా ఉంటే మొదటి వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సుల్తానాకి ఓట్లు చాలా తక్కువ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటివారం అభినయశ్రీ లేదా సుల్తానా వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.