Bigg Boss Season 6 Day 5 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఐదో ఎపిసోడ్ లో.. కంటెస్టెంట్ గీతు రాయల్ కి ఇంటిలో సభ్యులు ఊహించని షాక్ ఇవ్వటం జరిగింది. ఇంటిలో ఒకరిని ఈ వారం వరస్ట్ కంటెస్టెంట్ గా నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాలకు.. హౌస్ లో సభ్యులు డిస్కషన్ పెట్టారు. ఈ క్రమంలో దాదాపు హౌస్ లో సగం మంది సభ్యులు గీతు నీ వరస్ట్ పెర్ఫార్మర్ గా నామినేట్ చేశారు.
గీతు నీ నామినేట్ చేసిన వాళ్లు ఎవరంటే… సుదీప, వాసంతి, శ్రీ సత్య, ఆరోహి, రోహిత్ మరియు మెరీనా, సూర్య, చంటి, సుల్తానా, రాజశేఖర్, నేహా, అర్జున్..నామినేట్ చేశారు. హౌస్ లో అందరికంటే గీతుకి వరస్ట్ పెర్ఫార్మర్ గా స్టాంపులు పడటంతో ఆమెను ఇంటి సభ్యులు శుక్రవారం ఎపిసోడ్ లో జైల్లో కూర్చోబెట్టారు. గీతు హౌస్ లో అడుగుపెట్టిన నాటినుండి చాలా రేష్ గా తోటి కంటెస్టెంట్లతో వ్యవహరిస్తూ ఉంది.

గొడవలకు దిగడంతో పాటు ఎదుటి వారు చెప్పేది వినకుండా.. ఎవరిపై పడితే వాళ్లపై నిందలు వేయటం జరిగింది. ఇంకా కెప్టెన్సీ టాస్క్ లో కూడా రూల్స్ అతిక్రమించి గేమ్ ఆడింది. దీంతో మిగతా కంటెస్టెంట్లు ప్రశ్నిస్తే మీరు ఓడిపోవడం నా స్ట్రాటజీ అంటూ గీతు చేసిన తప్పును సమర్థించుకుంది. ఎట్టకేలకు ఇంటిలో సభ్యులందరికీ అవకాశం రావడంతో బిగ్ బాస్ మొదటి వారం వరస్ట్ కంటెస్టెంట్ గా హౌస్ లో 21 మంది ఉంటే ఏకంగా 13 మంది గీతు నీ నామినేట్ చేయటం జరిగింది.
నోట్: బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం rtvmedia.in, Rtv Telugu ని సబ్‌స్క్రైబ్ చెయ్యండి!