Bigg Boss Season 6 Day 5 Highlights: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా సిరి నిలిచింది అన్న సంగంతి తెలిసిందే. సీజన్ ఫైన్ లో ఫిజికల్ టాస్క్ పరంగా ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా సిరి తన బెస్ట్ ఇవ్వటం జరిగింది. ఇక అదే షోలో సిరి బాయ్ ఫ్రెండ్ గా వచ్చిన శ్రీహాన్ ఎపిసోడ్..సీజన్ ఫైవ్ మొత్తానికి చాలా హైలెట్ అయింది. దీంతో వీరిద్దరి ప్రేమ బయట ప్రపంచానికి అప్పటినుండి తెలిసింది. సీజన్ ఫైవ్ అయిపోయాక కూడా శ్రీహాన్ మరియు సిరి పలు టెలివిజన్ షోలకు వచ్చారు. దాదాపు కొన్ని సంవత్సరాల నుండి రిలేషన్ లో ఉన్న వీరిద్దరికీ బిగ్ బాస్ తర్వాత బయట మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ క్రీయేట్ అయింది.
కాగా సీజన్ సిక్స్ లో ప్రస్తుతం శ్రీహాన్ రాణిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఫేవరెట్ బరిలో కూడా మనోడు పేరు వినబడుతోంది. ఇదిలా ఉంటే ఐదో రోజు ఎపిసోడ్ లో వరస్ట్ పెర్ఫార్మెన్స్ నామినేషన్ ప్రక్రియలో సుల్తానా.. సిరి పై వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో శ్రీహన్ ఒక్కసారిగా సుల్తానా పై సీరియస్ అయిపోయాడు. మేటర్ లోకి వెళ్తే వరస్ట్ పెర్ఫార్మన్స్ నామినేషన్ ప్రక్రియలో సుల్తానా నీ శ్రీహన్ నామినేట్ చేయడం జరిగింది. దీంతో సుల్తానా కి శ్రీహన్ మధ్య గట్టిగా డిస్కషన్ జరిగింది.
మధ్యలో సుల్తానా నీకు బయట సిరి ఉంది. నేను సొంతంగా హౌస్ లో గేమ్ ఆడటానికి వచ్చాను. ఫైట్ చేయటానికి వచ్చాను అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో శ్రీహాన్… హౌస్ లో విషయాలు గురించి మాట్లాడు బయట వ్యక్తుల గురించి మాట్లాడొద్దు అంటూ చాలా సీరియస్ గా సుల్తానాకి ఐదో రోజు ఎపిసోడ్ లో వార్నింగ్ ఇచ్చాడు. వరస్ట్ నామినేషన్ ప్రక్రియ అయిపోయాక కూడా సుల్తానా..శ్రీహన్ కి మధ్య గట్టిగానే డిస్కషన్ జరిగింది. ఇద్దరికిద్దరూ ఎక్కడ తగ్గలేదు. ఏదిఏమైనా గేమ్ లో లేని తన లవర్ సిరి గురుంచి సుల్తానా వ్యాఖ్యలకు శ్రీ హాన్ మాత్రం చాల స్ట్రాంగ్ గాన్నే రియాక్ట్ కావడం జరిగింది.