Bigg Boss Season 6 Day 5 First Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటి కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించి శుక్రవారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు పోటీ పడుతున్నట్లు ప్రోమోలో చూపించడం జరిగింది. ఈ ప్రోమోలో ఆరో సీజన్ కి కెప్టెన్ అవడానికి..”కెప్టెన్సీ బండి” అనే టాస్క్ ఇంటి సభ్యులకు పెట్టడం జరిగింది. సంచాలకుడిగా ఫైమా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో హౌస్ కి మొట్టమొదట కెప్టెన్ అవటానికి ఇంటి సభ్యులు ఎవరికి వారు… టాస్క్ లలో గట్టిగానే పోటీ పడినట్లు ప్రోమోలో చూపించారు.
ఈ క్రమంలో గీతూ రాయల్ కి మెహరీన్ కి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సంచాలకుడిగా ఉన్న ఫైమా… పోటీదారుడు రేవంత్ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంక నేహా చౌదరికి..ఫైమాకి మధ్య కూడా గట్టిగానే గొడవ జరిగినట్లు కనిపించింది. రకరకాల టాస్కులు హౌస్ కి కెప్టెన్ అవటానికి ఇంటి సభ్యులకు బిగ్ బాస్ పెట్టడం జరిగింది.
మరి శుక్రవారం జరగబోయే ఎపిసోడ్ లో ఎవరు ఇంటి కెప్టెన్ అయ్యారో చూడాలి. గమ్మత్తేమిటంటే హౌస్ నుండి ఎలిమినేట్ కావటానికి నామినేట్ అయిన.. రేవంత్ కూడా కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనటం..ప్రోమోలో చూపించారు. మరి రేవంత్ ఎలాగా కెప్టెన్సీ టాస్క్ లో వచ్చాడు..? అన్నది చాలా సస్పెన్స్ గా నెలకొంది.