Bigg Boss Season 6 Day 5 Episode Review: బిగ్ బాస్ సీజన్ 6 ఐదో రోజు ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ ఇంకా ఈ వారం వరస్ట్ పర్ఫామెన్స్ కి సంబంధించి హౌస్ మేట్స్ మధ్య జరిగిన సంఘటనలు గత నాలుగు ఎపిసోడ్ లు కంటే హైలైట్ గా నిలిచాయి. ఐదో రోజు ఎపిసోడ్ లో చాలామంది ఓపెన్ అయిపోయారు. ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించి “కెప్టెన్ బండి” అనే టాస్క్ పెట్టారు. ఫైమా సంచాలక్ గా చేసింది. ఈ క్రమంలో గేమ్ మధ్యలో నేహా చౌదరికి..ఫైమాకి గొడవ జరిగింది. ఇక యధావిధిగా గీతు రాయల్ అడ్డదిడ్డంగా గేమ్ ఆడటం మాత్రమే కాదు.. కొన్ని రూల్స్ బ్రేక్ చేసేసింది. టాస్క్ లో కారుకి పెట్టాల్సిన నెంబర్ లు వెతికే టైం,. “కీ” వెతికిన సమయంలో గానీ.. రూల్స్ కి వ్యతిరేకంగా గీతు రాయల్ ఆడింది. దీంతో టాస్క్ అయిపోయాక గీతుకి మిగతా కంటెస్టెంట్ లకి మధ్య గట్టిగా గొడవ జరిగింది.
ఇదిలా ఉంటే కెప్టెన్సీ టాస్క్ లో బాలాదిత్య గెలవడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 6 ఫస్ట్ కెప్టెన్ గా బాలాదిత్య.. గెలవటం పట్ల మిగతా కుటుంబ సభ్యుల సైతం టాస్క్ అయిపోయాక సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఈవారం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో హౌస్ మెట్స్ తెలియజేసి వాళ్ళని జైలుకు పంపాలని బిగ్ బాస్ ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో హౌస్ లో చాలామంది గీతు రాయల్ నీ వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు. ప్రోసెస్ లో భాగంగా..గీతు ముఖానికి చాలానే స్టాంపులు పడ్డాయి. గీతు మాటతీరుతోపాటు… అవతల వ్యక్తికి గౌరవం ఇవ్వకపోవడం, ఇంకా మాట ఇసిరేయడం తరహా వ్యవహారం నచ్చలేదని చాలామంది రీజన్స్ చెప్పుకొచ్చారు. మనందరం కుటుంబ సభ్యులం అలాగే ఉండాలని కొంతమంది అంటే…. దానికి గీతు రిప్లై ఇస్తూ నేను బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడటానికి వచ్చాను. నాకు ఎవరి రిలేషన్ అవసరం లేదంటూ సీరియస్ రిప్లై ఇచ్చింది. అయితే వరస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రక్రియలో ఎక్కువ స్టాంపులు గీతుకి పడటంతో బిగ్ బాస్ ఆదేశాలు మేరకు ఆమెను జైల్లో పెట్టారు.

దీంతో జైల్లో ఉన్న గీతు దగ్గర ఫైమా డిస్కషన్ పెట్టింది. ఇంటిలో అందరూ నీ మాట తీరు వల్లే నిన్ను వరస్ట్ పెర్ఫార్మరుగా ఎన్నుకున్నారని ఫైమా.. చెబుతూ ఉన్న సమయంలో..మధ్యలో గీతు కలుగజేసుకున్నీ నాకంటే రేవంత్, సుల్తానా చాలా దారుణంగా మాట్లాడుతారు. వాళ్లని టార్గెట్ చేయకుండా నన్ను ఎందుకు చేశారంటే గుంపులో గోవిందా అన్న తరహాలో అంటూ ఫైమా..కి గీతు రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉంటే వరస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రక్రియలో భాగంగా శ్రీహాన్ కి ఇనాయ సుల్తానా కి మధ్య చాల పెద్ద గొడవ జరిగింది. సుల్తానా… మాట్లాడుతూ “శ్రీహాన్ నీకు బయట సిరి ఉంది”. నాకు ఎవరు లేరు. నేను సింగిల్ గా గేమ్ ఆడటానికి వచ్చాను. గేమ్ ఆడతాను, ఫైట్ చేస్తాను అంటూ పెద్ద పెద్ద డైలాగులు వేసింది. దీంతో శ్రీహాన్ ఇక్కడ హౌస్ లో విషయాలు మాత్రమే మాట్లాడు బయట వ్యక్తులు గురించి మాట్లాడొద్దు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.
ఆ తర్వాత శ్రీహాన్ కంటతడి పెట్టాడు. దీంతో సూర్య ఇంకా ఆరోహి వచ్చి శ్రీహాన్ నీ ఓదార్చడం జరిగింది. ఆ తర్వాత సుల్తానాతో… శ్రీహన్ డిస్కషన్ పెట్టారు. దీంతో నామినేషన్ సమయంలో కీర్తి ఇంకా శ్రీహాన్ మధ్య జరిగిపోయిన సంభాషణ లేవనెత్తి ఫీలింగ్స్ అంటూ.. సుల్తానా మాట్లాడటం పట్ల.. శ్రీహాన్ మళ్లీ సీరియస్ అయ్యాడు. ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. బయటకు ఎలా ప్రోజెక్ట్ అవుతుందో నాకు తెలియదు. హౌస్ లో మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి.రాంగ్ స్టేట్మెంట్లు పాస్ చేయొద్దు అని అంటూ సుల్తానాకి గట్టిగా ఐదో రోజు ఎపిసోడ్ చివరిలో శ్రీహాన్ క్లాస్ తో ఎపిసోడ్ ముగిసింది. మొత్తం మీద చూసుకుంటే ఐదో రోజు ఎపిసోడ్ లో గత నాలుగు రోజులు గీతు వ్యవహరించిన తీరుకు వరస్ట్ కంటెస్టెంట్ గా ఆమెను నామినేట్ చేసి రివేంజ్ తీర్చుకున్నారు. ఇక ఇదే సమయంలో సుల్తానా.. ఫ్రస్టేషన్ తో… శ్రీహాన్ ఇంకా బాలాదిత్యా, నేహా చౌదరితో గొడవలు పెట్టుకోవడం హైలైట్ అయ్యాయి.