Bigg Boss Season 6 Day 4 Second Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ నాలుగో ఎపిసోడ్ కి సంబంధించి సెకండ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో రోహిత్ మరియు మెరీనాల మధ్య శ్రీ సత్య గొడవ పెట్టినట్లు తెలుస్తోంది. ఇంకా ఇదే సమయంలో కెప్టెన్సీ టాస్క్ కూడా గురువారం ఎపిసోడ్ లో ఎన్నుకునే ఛాన్స్ ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇవ్వటం జరిగింది. ముగ్గురిలో ఒకరు కెప్టెన్సీ ఎన్నుకోవాలి. ఎవరు కావాలనుకుంటున్నారో… ఇంటిలో ఉన్న సభ్యులు తెలియజేయాలని.. బిగ్ బాస్ ఆదేశించారు. ఈ క్రమంలో బాలాదిత్య.. ఓట్లు పరంగా మాట్లాడుతూ ఉండగా.. గీతు రాయల్ లేచి అతనిపై గొడవకు దిగింది.
ఎవరి అభిప్రాయాలు వారు తెలియజేయాలని బిగ్ బాస్ చెబితే ఓట్లు అని మాట్లాడటం.. నాకు నచ్చలేదని తనదైన శైలిలో ఘాటుగా చెప్పింది. ఇంకా పాటల పోటీ టాస్క్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సింగర్ రేవంత్ కి ఆరోహికి మధ్య గొడవ కూడా జరిగింది. ప్రోమో చివరిలో ఆరోహి ఏడుస్తూ ఉండటంతో సూర్య ఓదారుస్తున్నట్లు చూపించారు.
మొత్తం మీద మరికొద్ది గంటల్లో ప్రసారం కానున్న నాలుగో ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ తో పాటు.. రకరకాల గేమ్స్ బిగ్ బాస్ ఇంటి సభ్యులతో ఆడించ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో సింగర్ రేవంత్ తాను జనాల కోసం నటించడం రాదని.. హౌస్ నుండి వెళ్ళిపోవాలి ఉంది అంటూ అసహనంగా డైలాగులు వేయడం జరిగింది.