Bigg Boss Season 6 Day 4 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ షో మొదటి రోజు నుండే ఎవరికివారు తమ గేమ్ స్ట్రాటజీ స్టార్ట్ చేసేశారు. హౌస్ లో అప్పుడే గొడవలు ఇంకా ఏడుపులు సింపతి గేమ్.. మరియు స్క్రీన్ స్పేస్ కోసం పెర్ఫార్మన్స్ ఎవరికి వారు ఇచ్చేస్తున్నారు. కావాలని గొడవ పెట్టి మరి కెమెరాల ముందు రెచ్చిపోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే హౌస్ నుండి మొదటి వారం ఎలిమినేషన్ కి ఏడుగురు నామినేట్ కావడం జరిగింది.

అయితే మొదటి వారం వీకెండ్ దగ్గరకు వచ్చేస్తున్నా గాని సీజన్ సిక్స్ కి సంబంధించి మొదటి కెప్టెన్ ఎవరు అన్నదానిపై ఇంకా హౌస్ లో క్లారిటీ రాలేదు. గురువారం జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ కి సంబంధించి మాస్ గ్రూపులో ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాలని.. ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామంతో మొదటి వారం బిగ్ బాస్ సీజన్ సిక్స్ కెప్టెన్సీ బరిలో బాలాదిత్యా, సూర్య, రోహిత్… మెరీనా నిలిచారు.

ఇక ఇదే సమయంలో క్లాస్ గ్రూప్ నుండి కూడా కెప్టెన్సీ బరిలో ఒకరు వచ్చే అవకాశం ఉందని శుక్రవారం జరిగే ఎపిసోడ్ లో.. మాస్ గ్రూపులో సెలెక్ట్ అయ్యి వారిలో టాస్క్ పెట్టి ఒకరిని ఇంకా క్లాస్ గ్రూపులో నుండి ఒకరిని..ఈ ఇద్దరికీ.. టాస్క్ పెట్టి మొదటివారం కెప్టెన్సీ అయ్యో ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చినట్లు సమాచారం. కాగా లీక్ వార్తల ప్రకారం బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫస్ట్ కెప్టెన్ గా గీతు రాయల్ అయినట్లు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి.