Bigg Boss Season 6 Day 4 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో టైటిల్ ఫేవరెట్ బరిలో వినబడుతున్న పేర్లలో సింగర్ రేవంత్ పేరు కూడా ఉంది. రేవంత్ ఆల్ రెడీ ఇండియన్ ఐడిల్ టైటిల్ కూడా గెలవడం జరిగింది. సింగర్ గా బయట 200కు పైగా అనేక భాషలలో పాటలు కూడా పాడారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ హౌస్ లో అందరికంటే ఎక్కువగా రేవంత్ కి ఉంది అని చెప్పవచ్చు. ఈ రకమైన ఫాలోయింగ్ ఉన్నా గాని హౌస్ లో రేవంత్ ప్రతిదానికి ఆవేశపడిపోవడం, ఏడవటం.. అతనికి మైనస్ గా మారింది. ఈ క్రమంలో రేవంత్ ని చాలా తెలివిగా ఒకపక్క రెచ్చగొడుతూ.. ఆదిరెడ్డి మైండ్ గేమ్ తో సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఉన్నాట్లు నాలుగో ఎపిసోడ్ చూశాక బయట టాక్.
రేవంత్ వాళ్ళ ఎవరైనా ఏడుస్తున్నారు అంటే.. వాళ్ల దగ్గరికి వెళ్లి ఆది రెడ్డి ఓదారుస్తున్నాడు. మరోపక్క ఇదే సమయంలో రేవంత్ నీ సూటు పోటి మాటలతో రెచ్చగొడుతున్నారు. నాలుగో రోజు ఎపిసోడ్ చివరిలో ఇతర సభ్యులతో రేవంత్ మాట్లాడుతూ ఉంటే.. ఆదిరెడ్డి మధ్యలో కలుగజేసుకునీ రేవంత్ ఇండియన్ ఐడీల్ గురించి మాట్లాడి సంబంధం లేకుండా కలుగజేసుకుని రెచ్చగొట్టాడు. దీంతో రెచ్చిపోయిన రేవంత్ సోషల్ మీడియా నుండి రాలేదని ఒకసారిగా నోరు జారడంతో ఇంకా ఆదిరెడ్డి తనదైన శైలిలో సంచలన డైలాగులు వేయడం జరిగింది.
హౌస్ లో ఎవరైనా ఒకటే.. అంటూ మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఇంటి సభ్యులు రేవంత్ ని లోనికి తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో గీతు రాయల్ అసలు డిస్కషన్ జరగకుండా ఆపేయడం కరెక్ట్ కాదు. డిస్కషన్ జరిగితేనే అవతల మైండ్ లో ఏమున్నది బయటకు వస్తుంది అని డైలాగులు వేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న రేవంత్ ఆవేశాన్ని రెచ్చగొడుతు.. ఆదిరెడ్డి తనదైన మైండ్ గేమ్ హౌస్ లో అద్భుతంగా ప్లే చేస్తూ ఉన్నారు.