Bigg Boss Season 6 Day 4 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ నాలుగో రోజు ఎపిసోడ్ లో అనేక గొడవలు ఇంకా కెప్టెన్సీ టాస్క్.. ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం జరిగింది. ఎలిమినేషన్ నామినేషన్ ఎపిసోడ్ తర్వాత జరిగిన నాలుగో ఎపిసోడ్ లో రేవంత్ చాలా హైలెట్ అయ్యాడు. ముందుగా తనని చాలామంది నామినేట్ చేయడంతో కొద్దిగా డిప్రెషన్ కి ఫీల్ కావడం జరిగింది. ఆ తర్వాత నార్మల్ అయినా రేవంత్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో తన టీమ్ లో ఉన్న ఆరోహి.. వద్దన్నా కొద్ది టీం తరఫున నిలబడి ఓడిపోయింది. అది సింగింగ్ ఇంకా సినిమాల గురించి టాస్క్. ఈ టాస్క్ ఆడటానికి ముందుగా తాను వెళ్తానని సింగర్ రేవంత్ చెప్పినా గానీ ఆరోహి వినకుండా వెళ్లి మరీ ఓడిపోయింది.
దీంతో రేవంత్ కోపం వచ్చి కొద్దిగా ఆమెను వారించడంతో ఆమె తిరిగి రేవంత్ పై సీరియస్ అయిపోయింది. ఏకంగా వేలు చూపించి మరి మీదకు రావడంతో రేవంత్ కూడా ఎక్కడ తగ్గలేదు. ఈ క్రమంలో సూర్య కలుగజేసుకుని ఇద్దరిని సైలెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆరోహి ఏడవడంతో ఆమెను సూర్య ఓదార్చాడు. ఆ తర్వాత రేవంత్ ఇంకా సూర్య మధ్య గట్టిగా డిస్కషన్ జరిగింది. తనని వేలు పెట్టి చూపిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని రేవంత్… సూర్యకి ఆరోహి గురించి తెలియజేశారు.
అసలు ఇక్కడ నాకు ఇంతమంది ముందు.. తిట్టించుకోవడం అసలు నాకు నచ్చటం లేదు. ఈ క్షణం బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోవాలి.. అని ఆదేశాలు ఇస్తే ఆనందంగా వెళ్ళిపోతాను. తిడుతుంటే ఊరుకుంటున్నా.. నేను సీరియస్ గా తీసుకుంటే చుక్కలు చూపిస్తా. బయట కాదు హౌస్ లోనే రివెంజ్ తీర్చుకుంటా అంటూ సూర్య వద్ద రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేయడం నాలుగో ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది.