Bigg Boss Season 6 Day 4 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో జరిగిన నాలుగు ఎపిసోడ్ లలో చంటి తనదైన శైలిలో కామెడీ పండిస్తూ అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాలెన్సింగ్ గేమ్ ఆడుతూ.. ప్రతి ఒక్కరిని అంచనా వేయడంలో సక్సెస్ అవుతున్నాడు. ఈ క్రమంలో తనని ఎవరు ప్రభావితం చేసిన పెద్దగా ట్రాప్ లో పడకుండా.. చాలా చక్కగా గేమ్ ఆడుతున్నాడు. ఆఖరికి ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో సైతం కామెడీ పండించి అందరిని నవ్వించడం జరిగింది. అటువంటి చంటి నాలుగో ఎపిసోడ్ లో హౌస్ లో ఎలాంటి మనస్తత్వం కలిగిన మనుషులు ఉన్నారో… తోటి కంటెస్టెంట్ అభినయశ్రీకి వివరించాడు.

హౌస్ లో కెమెరా స్పేస్ కోసం… ఆరాటపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు..ఇది ఒక టైపు. నేను చెప్పేది అందరూ వినాలి ఇలాంటి టైప్ ఇంకొకళ్ళు. ఇంకా రెండు కలిపిన వాళ్లు నేను చెప్పేదే వినాలి.. అందరు నన్నే చూడాలి. అయితే వీళ్ళందరూ విషయంలో ఓటింగ్ వేసేవాళ్ళు కూడా ఒకసారి ఆలోచిస్తారు అంటూ చంటి హౌస్ లో ఉన్న మనస్తత్వాలు గురించి తెలియజేయడం జరిగింది. ఇదిలా ఉంటే మొదటి వారం ఎలిమినేషన్ నామినేషన్ లో చంటి కూడా ఉన్నాడు. శుక్రవారం రాత్రి 11 :59 నిమిషాలకు ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది.
ప్రస్తుతం ఓటింగ్ పరంగా చలాకి చంటి కి గట్టిగానే ఓట్లు పడుతున్నట్లు బయట టాక్ వినిపిస్తోంది. ఎక్కువగా గొడవల్లోకి వెళ్లకుండా.. చాలా పెద్ద రకంగా కామెడీ పరంగా హౌస్ లో చంటి గేమ్ ఉండటంతో.. మనోడు ఆడుతున్నాడు కచ్చితంగా టాప్ ఫైవ్ లో చంటికి బెర్త్ కన్ఫామ్ అని జనాలు అంటున్నారు.