Bigg Boss Season 6 Day 4 Episode Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ నాలుగో ఎపిసోడ్ గొడవలతో నిండిపోయింది. మూడో ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత స్టార్ట్ అయిన నాలుగో ఎపిసోడ్ ప్రారంభంలో.. తనని బాడీ షేమింగ్ చేయటం పట్ల మెరీనా.. సోఫా రూమ్ లో..మళ్ళీ డిస్కషన్ పెట్టి ఆరోహి పై సీరియస్ అయింది. ఈ క్రమంలో కలుగజేసుకున్న బాలాదిత్య.. వివరణ ఇస్తూ ఉండగా మధ్యలో సుల్తానా పేరు రావడంతో ఇద్దరికీ గొడవ జరిగింది. సుల్తానా ఫ్రస్టేషన్ తో ఆదిత్య పై సీరియస్ అయిపోయింది. అయితే గార్డెన్ ఏరియాలో జరగాల్సిన డిస్కషన్ మళ్లీ సోఫా రూమ్ లోకి తీసుకురావడం పట్ల చంటి అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గీతు రాయల్ కి.. చంటికి మధ్య కూడా గట్టిగానే డిస్కషన్ జరిగింది.
ఆ తర్వాత నామినేట్ కి గురైన ఇంటి సభ్యులు రేవంత్, శ్రీ సత్య, ఆరోహి, సుల్తానా పానిక్ అయ్యారు. దీంతో బాలాదిత్య.. మరి కొంతమంది నామినేట్ అయిన సభ్యులను ఓదార్చడం జరిగింది. ఈ క్రమంలో రేవంత్ నీ బాలాదిత్య ఓదార్చాడు. ఆ తర్వాత హౌస్ కెప్టెన్ నీ ఎన్నుకోవాలని..ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో బాలాదిత్య.. ఓటింగ్ పరంగా ఎన్నుకోవాలని ఇంటి సభ్యులకు తెలియజేయగా, గీతు రాయల్ సీరియస్ అయ్యి.. అభిప్రాయాపరంగా కెప్టెన్ నీ ఎన్నుకుంటే బాగుంటుందని తెలిపింది. ఈ సమయంలో మాస్ గ్రూప్ కి చెందిన వాళ్లు ఎవరికి వాళ్లు తమ అభిప్రాయాలను తెలియజేయగా… బిగ్ బాస్ సీజన్ 6 మొదటివారం కెప్టెన్ రేసులో రోహిత్ మెరీనాతో పాటు సూర్య, బాలాదిత్య సెలెక్ట్ కావడం జరిగింది.
అనంతరం ఇంటి సభ్యులందరికీ సినిమా పాటలు మరియు టైటిల్ గుర్తించే రీతిలో టాస్క్ పెట్టి రెండు టీమ్స్ గా విభజించి సంచాలకుడిగా సూర్య నీ పెట్టడం జరిగింది. ఏ టీం, బీ టింగా విభజించగా… ఏ టీం నుండి ఆరోహి, బీ టీం నుండి శ్రీ సత్య పాల్గొన్నారు. ఈ టాస్క్ లో బీ టీం.. గెలవడం జరిగింది. శ్రీ సత్య చాల ఫాస్ట్ గా ప్రశ్నలకు రియాక్ట్ అయి బజర్ నొక్కి గెలవడం జరిగింది. దీంతో ఆరోహి టీంలో రేవంత్ ఉన్నటంతో సినిమా పాటలు కాంపిటేషన్ కావడంతో ముందుగా రేవంత్ వెళ్తానని.. చెప్పినా గాని ఆరోహి వెళ్లడం ఓడిపోవడంతో టాస్క్ అయిపోయాక వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. రేవంత్ మాటలకు ఆరోహి ఏడవటం కూడా జరిగింది. అదే సమయంలో రేవంత్ పై వేలు చూపిస్తూ కొద్దిగా మాటలు కూడా జారింది. ఈ క్రమంలో సూర్య కలుగజేసుకుని ఇద్దరికీ నచ్చ చెప్పాడు.

దీంతో బాగా ఫ్రస్టేషన్ కి గురైన రేవంత్ హౌస్ లో తనకి నటించడం రాదని.. ఇప్పటికీ ఇప్పుడు హౌస్ నుండి వెళ్లిపోవడానికి కూడా రెడీ అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఏడుస్తున్న ఆరోహిని ఆదిరెడ్డి ఇంకా శ్రీ సూర్య ఓదార్చారు. ఆ తర్వాత ఆరోహి తానే అనవసరంగా నోరిజారినట్లు రేవంత్ తో డిస్కషన్ పెట్టి అతనికి సారీ చెప్పింది. అయితే ఇక్కడ గమనిస్తే ఆదిరెడ్డి చాలా తెలివిగా రేవంత్ నీ రెచ్చగొట్టే రీతిలో నాలుగో ఎపిసోడ్ లో కనిపించింది. తన కోపం గురించి ఇతర కుటుంబ సభ్యులతో రేవంత్ మాట్లాడుతుండగా మధ్యలో కలుగజేసుకున్న ఆదిరెడ్డి.. నువ్వు ఇండియన్ ఐడిల్ గెలిస్తే ఏంటి..? ఇంకేంటి..? అందరూ ఇక్కడ సమానమే అని.. ఆ సందర్భంగా మాట్లాడాడు. ఈ క్రమంలో నేను సోషల్ మీడియా నుండి రాలేదు అని రేవంత్ అనడంతో ఆదిరెడ్డి మరింత రెచ్చిపోయారు.
బిగ్ బాస్ హౌస్ అనేది అందరికీ సమానమే.. అంటూ రేవంత్ నీ రెచ్చగొడుతూ చాలా తెలివిగా గేమ్ ఆడాడు. ఇక తర్వాత గీతు రాయల్ ఎప్పటిలాగానే అందరిపై విమర్శలు చేస్తూ.. బాత్రూం దగ్గర ఇంకా పలు చోట్ల… ఇంటి సభ్యులపై విమర్శలు చేస్తూ వ్యవహరించింది. చంటి…అభినయశ్రీ దగ్గర డిస్కషన్ పెట్టి హౌస్ లో రెండు రకాల మనుషులు ఉన్నారు. ఒకటి స్క్రీన్ స్పేస్ కోసం కెమెరాల దగ్గర ఉండేవాళ్లు. ఇంకొకరు నేను చెప్పిందే రైట్ అనే వాళ్ళు. రెండు కలిపి తీసుకునే వాళ్ళు అందరూ నన్నే చూడాలి, అందరు నాకే ఓటేయాలి అని అనుకునే వాళ్ళు. వీళ్లను చూస్తే ఓటేసే వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచిస్తారు అంటూ ఇంటిలో సభ్యుల మనస్తత్వాలు గురించి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఆరోహి వద్ద ఫైమా డిస్కశన్ పెట్టడం జరిగింది. ముందు ఒకలాగా వెనక ఒకలాగా మాట్లాడటంతో తాను నామినేషన్ లో అలా ప్రవర్తించాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక చివరిలో తెల్ల పేపర్ పై మధ్యలో నల్ల చుక్క ఉంటే ఏది కనిపిస్తుంది అంటూ బాలాదిత్య… రేవంత్ కి తెలియజేసి కోపపడకూడదని పరోక్షంగా క్లాస్ తీసుకున్నారు. ఈ రీతిగా నాలుగో ఎపిసోడ్ ముగిసింది.