Bigg Boss Season 6 Day 3 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రోసెస్ గత ఐదు సీజన్ లకి భిన్నంగా నడిచింది. గతంలో సోమవారం ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ హౌస్ లో జరిగేది. కానీ ఈసారి సోమవారం మూడు గ్రూపులుగా విభజించి దానిని కొనసాగిస్తూ బుధవారం దాకా ఆడించారు. అప్పటికే ట్రాష్ గ్రూప్ లో ఉన్న ముగ్గురు.. ఆదిత్య, సుల్తానా, అభినయశ్రీ డైరెక్ట్ గా మొదటివారం ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. అయితే ఆ తర్వాత బుధవారం మూడో ఎపిసోడ్ లో మాస్ గ్రూపులో ఉన్న 15 మంది సభ్యులకు.. ఎలిమినేషన్ నామినేషన్ ప్రోసెస్ పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఎవరికి వారు తమ రీజన్ చెప్పి ఎందుకు నామినేట్ చేస్తున్నారో తెలియజేశారు.
అయితే ఎవరు..? ఎవరిని..? నామినేట్ చేశారు.. చూస్తే..సింగర్ రేవంత్ స్టార్ట్ చేసి..ఫైమా, అరోహీ నీ నామినేట్ చేశారు. ఆ తర్వాత సుదీప.. రేవంత్ మరియు చంటిని నామినేట్ చేశారు. ఆ తర్వాత ఫైమా.. రేవంత్, అర్జున్ నీ నామినేట్ చేసింది. నెక్స్ట్ అర్జున్ వచ్చి..ఫైమా, ఆరోహి నీ నామినేట్ చేశారు. ఆ తర్వాత కీర్తి.. వంతు వచ్చేసరికి రేవంత్, చంటిని నామినేట్ చేసింది. అనంతరం ఆరోహి వచ్చి రేవంత్, శ్రీ సత్య ని నామినేట్ చేసింది. ఆ తర్వాత రాజ్ వచ్చి శ్రీ సత్య, వాసంతిని నామినేట్ చేశారు. ఇక షానీ.. చంటిని ఇంకా శ్రీ సత్య ని నామినేట్ చేయడం జరిగింది. శ్రీ సత్య.. వాసంతిని అదేవిధంగా రాజ్ ని నామినేట్ చేయడం జరిగింది. రోహిత్ మెరీనా కలిసి ఫైమా, చంటి లనీ నామినేట్ చేశారు. శ్రీహాన్.. రేవంత్ ఇంకా కీర్తిని నామినేట్ చేశాడు.
ఆ తర్వాత చంటి వచ్చి రేవంత్ తో పాటు సుదీపాన్ని నామినేట్ చేయడం జరిగింది. చివరిలో సూర్య వచ్చి.. చంటిని అదేవిధంగా రేవంత్ ని నామినేట్ చేశాడు. ఈ ఎలిమినేషన్ నామినేషన్ ప్రోసెస్ మొత్తం చూస్తే ఎక్కువ మంది రేవంత్ ని నామినేట్ చేయడం జరిగింది. ఇక చివరిలో క్లాస్ గ్రూపులో ఉన్న ముగ్గురు మాస్ గ్రూపులో ఒకరిని ట్రష్ గ్రూపులో.. తీసుకొచ్చి ఒకరిని రిప్లైస్ చేయొచ్చని తెలియజేస్తే క్లాస్ గ్రూపులో ఉన్న గీతు రాయల్.. ఆదిరెడ్డి, నేహా..ట్రాష్ లో ఉన్న ఆదిత్యాని సేవ్ చేసి.. మాస్ లో ఉన్న ఆరోహిని తీసుకొచ్చారు. దీంతో మొదటి వారం రేవంత్, ఆరోహి, అభినయశ్రీ, సుల్తానా, ఫైమా, శ్రీ సత్య, చంటి నామినేట్ అయ్యారు.