Bigg Boss Season 6 Day 3 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో మొత్తం 21 మంది కలిసి గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. మూడో ఎపిసోడ్ వచ్చేసరికి మొదటి వారం హౌస్ నుండి ఏడుగురు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. గతంలో సోమవారం ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ ప్రాసెస్ జరగగా… సీజన్ సిక్స్ లో బుధవారం వరకు ఆ ప్రాసెస్ జరగటం చాలా కొత్తగా ఉంది. దీంతో ఇప్పుడు హౌస్ నుండి ఎవరు తొలివారం ఎలిమినేట్ అవుతారని సస్పెన్స్ గా నెలకొంది. ఇప్పటికే హౌస్ లో సింగర్ రేవంత్ పై చాలా వ్యతిరేకత.. హౌస్ మేట్స్ లో ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ అనేది సర్వసాధారణం.
గత సీజన్ లలో చాలావరకు లవ్ ట్రాక్ లు నడిచాయి. అయితే మూడో వారమో…నాలుగో వారం నుండో అవి బయటపడేవి. కానీ ఈ సీజన్ సిక్స్ లో మొదటి రోజే సూర్య.. కీర్తి తో క్లోజ్ కావటం జరిగింది. మొదటి ఎపిసోడ్ లో టీ షర్ట్ గురించి మాట్లాడుతూ ఆమెతో సూర్య.. పలికిన సంభాషణ చాలా హైలైట్ అయింది. తర్వాత రోజే వార్తల్లో కూడా నిలిచింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ అన్ సీన్ సన్నివేశాలలో మరో దృశ్యం సంచలనంగా మారింది. కీర్తి స్నానానికి వెళుతూ ఉండగా బయట గార్డెన్ ఏరియాలో పులిహార తింటూ ఉన్నాడు సూర్య.
ఈ క్రమంలో … ఆమెను వెనక్కి పిలిచి మరి ఒక స్పూన్ నోట్లో పెట్టి టేస్ట్ చూడమన్నాడు. ఆమె తిన్న తర్వాత ఇక చాలు నువ్వు స్నానానికి వెళ్ళిపో అన్నాడు. అంతేకాదు మొదటి వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్ లో…ఫస్ట్ ఎపిసోడ్ లో కీర్తి ఏడిచినప్పుడు రేవంత్ .. ఎక్కువ ఏడవ వద్దు పేస్ మీద ఉన్న మేకప్.. కరిగిపోతుందని డైలాగ్ చెప్పటం జాతిగింది. కాగా నామినేషన్ ప్రాసెస్ లో సూర్య అదే రీజన్ చెప్పి రేవంత్ ని నామినేట్ చేయడంతో.. కీర్తి ఇంకా సూర్య మధ్య సీజన్ సిక్స్ లో లవ్ ట్రాక్ స్టార్ట్ అయినట్టే అన్న టాక్ బయట బలంగా వినిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో వీరిద్దరి మధ్య ఎటువంటి కెమిస్ట్రీ ప్రొజెక్ట్ అవుతుందో చూడాలి.