Bigg Boss Season 6 Day 3 First Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మూడో రోజు ఎపిసోడ్ ప్రోమో 10 నిమిషాల క్రితం విడుదలయ్యింది. నిన్న ఆల్రెడీ ట్రాష్ గ్రూప్ కి చెందిన ముగ్గురు సుల్తానా, ఆదిత్య, అభినయశ్రీ డైరెక్ట్ గా మొదటి వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించేశారు. మరో పక్క క్లాస్ గ్రూప్ లో ఉన్న గీతు రాయల్, ఆదిరెడ్డి, నేహా సేఫ్ జోన్ లో ఉన్నట్లు మొదటి వారం నామినేషన్ నుండి తప్పించుకున్నట్లు తెలిపారు. దీంతో మిగతా 15 మంది ఇంటి సభ్యులకు బుధవారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ నిర్వహించినట్లు ప్రోమోలో చూపించారు. అయితే ఎక్కువగా చాలా మంది రేవంత్ నీ టార్గెట్ చేసినట్లు ప్రోమోలో తెలుస్తుంది.

ఇదే సమయంలో లేడీ కంటెస్టెంట్లలో కమెడియన్ ఫైమ నీ కూడా గట్టిగా టార్గెట్ చేయడం జరిగింది. ఈ ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్ లో రేవంత్ వర్సెస్ ఫైమ కి గట్టిగా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇంకా అర్జున్ కూడా..ఫైమ పై సీరియస్ అయ్యారు. ఇక ఆ తర్వాత సుదీప పింకీ.. రేవంత్ ని టార్గెట్ చేయడం జరిగింది. ఆరోహి కి…ఇంకా రేవంత్ మధ్య గట్టిగానే ప్రోమోలో వార్ జరిగినట్లు చూపించారు.
మొత్తం మీద మూడో రోజు ఎపిసోడ్ లో మిగతా 15 మంది గ్రూప్ సభ్యులకు ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్ తో.. బిగ్ బాస్ గట్టిగానే మంట పెట్టినట్లు తెలుస్తోంది. మొదటి వారం ఏలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ కూడా రెండు గ్రూపులుగా విభజించడం జరిగింది. అయితే మొదటిలోనే ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వాళ్ళు ఇంకా నామినేషన్ నుండి తప్పించుకున్న ఆరుగురు సభ్యులను పక్కన కూర్చోబెట్టడం జరిగింది. మరి మొదటివారం ఎవరు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారో.. ఈరోజు రాత్రి ఎపిసోడ్ లో తెలియనుంది.