Bigg Boss Season 6 Day 2 Second Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మూడో రోజు ఎపిసోడ్ కి సంబంధించి సెకండ్ ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమోలో.. ఫస్ట్ ప్రోమో మాదిరిగానే చాలావరకు రేవంత్ నీ నామినేట్ చేయడం జరిగింది. ఇంకా శ్రీ సత్య పై కూడా ఇంటి సభ్యులు గట్టిగానే డైలాగులు వేశారు. తన వ్యక్తిగత జీవితంలో కొన్ని సంఘటన వల్ల అందరిని సంతృప్తి పరచలేకపోతున్నట్లు శ్రీ సత్య తెలిపింది. చాలామంది శ్రీ సత్య విషయంలో ఆటిట్యూడ్ చూపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇక ఇదే సమయంలో రేవంత్ వర్సెస్ చంటి కి రూమ్ లో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు సూర్య సైతం కీర్తి విషయంలో.. రేవంత్ పై డైలాగులు వేయడం జరిగింది. ఇంక కీర్తి కూడా శ్రీహాన్ నీ నామినేట్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో శ్రీహాన్ గట్టిగానే రిప్లై ఇచ్చినట్లు తెలుస్తుంది. మూడో రోజు ఎపిసోడ్ కి సంబంధించి.. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో.. 15 మంది సభ్యుల మధ్య గట్టిగానే గొడవ జరిగినట్లు ప్రోమో బట్టి అర్థమవుతుంది.

చాలావరకు ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్ లో రేవంత్ నీ నామినేట్ చేసినట్లు అర్థమవుతుంది. మరి మొత్తంగా ఎపిసోడ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఆల్రెడీ ముగ్గురు డైరెక్టుగా మొదటి వీక్ లో ఎలిమినేషన్ కి నామినేట్ కావటం నిన్నే జరిగింది. మరి ఈరోజు ఎంతమంది నామినేట్ అవుతారు మొత్తంగా.. సంఖ్య ఎలా ఉంటుందో మూడో రోజు ఎపిసోడ్ అవితేగాని చెప్పలేము.