Bigg Boss Season 6 Day 2 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో చాలావరకు గీతూ రాయల్ వాయిస్ వినపడుతున్న సంగతి తెలిసిందే. గొడవలు పెడుతూనే మరోపక్క ఎవరి మీదకైనా వెళ్లిపోయేటట్టు మాటలు విసురుతూ ఉంది. దీంతో చాలావరకు అందరూ ఆమెను గమనిస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే హౌస్ లో అసలు నోరు మెదపకుండా సైలెంట్ గా ఉన్నవాళ్ళ లిస్ట్ ఎక్కువగానే ఉంది. ప్రారంభంలో పెద్ద గొప్ప మాట్లాడినా గాని తర్వాత చాలా వరకు ఇంటిలో ఉన్న సభ్యులు సైలెంట్ అయిపోయారు.

మరోపక్క చూస్తున్న ప్రేక్షకుల సైతం… అసలు తెలియని ముఖాలు తీసుకొచ్చారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు రెండు రోజులు ఎపిసోడ్ లో బాగా ప్రొజెక్ట్ అయిన పేర్లు చూస్తే రేవంత్, శ్రీహాన్, గీతు రాయల్, ఆదిరెడ్డి, బాలాదిత్య, ఇనయా సుల్తానా, నేహా చౌదరి, ఆరోహి, ఫైమా. ఈ 8 మంది మినహా మిగతా 13 మంది సభ్యులు అసలు నోరు కదపడం లేదు.

Bigg Boss Season 6 Day 2 Highlights: గట్టిగా టార్గెట్ చేయాలని అంటున్నారు
అంతా సైలెంట్ గా ఉండటంతో చూస్తున్న ప్రేక్షకులకు చిరాకు అనిపిస్తుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ మరిన్ని టాస్కులు పెట్టాలని వాళ్ళని కూడా గట్టిగా టార్గెట్ చేయాలని అంటున్నారు. గత సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ మరింత స్లోగా ఉందని బయట టాక్. స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్ లు సైతం ఏడవటం చూస్తున్న ప్రేక్షకులకు మరింత చిరాకు తెప్పిస్తున్నట్లయింది. వీళ్లు తప్ప మరి ఇంకెవరు దొరకలేదా నాయనా అని షో చూసినవాళ్లు బిగ్ బాస్ షోనిర్వహక్కులపై కంటెస్టెంట్ల విషయంలో పెదవి విరుస్తున్నారు. ఒకానొక టైంలో టిఆర్పి రేటింగ్ లలో బిగ్ బాస్ షో దూసుకుపోయేది. ఆ సమయంలో చాలావరకు తెలిసిన ముఖాలే హౌస్ లో కంటెస్టెంట్లుగా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు సీజన్ సిక్స్ లో అరా కోరా వాళ్లే తెలిసిన వాళ్ళుగా ఉన్నారు మిగతా వారిని గుర్తుపట్టే పరిస్థితి కూడా కనబడటం లేదు. మరి రానున్న రోజుల్లో షోపై ఏమన్నా ఇంట్రెస్ట్ కలిగించే రీతిలో.. పరిస్థితి ఉంటుందేమో చూడాలి.
నోట్: బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం rtvmedia.in, Rtv Telugu ని సబ్‌స్క్రైబ్ చెయ్యండి!