Bigg Boss Season 6 Day 2 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో రోజు ఆట రసవత్తరంగా సాగింది. గేమ్ స్టార్ట్ అయ్యే సరికి క్లాస్ గ్రూపులో.. ఆదిరెడ్డి, సూర్య, బాలాదిత్య ఉన్నారు. ఇంకా ట్రాష్ గ్రూప్ లో రేవంత్, గీతూ రాయల్, ఇనయా సుల్తానా ఉండటం జరిగింది. అయితే రెండవ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన క్రమంలో ట్రాష్ గ్రూప్ నుండి ఒకరు క్లాస్ గ్రూప్ కి రావచ్చని చెప్పటంతో పాటు ముగ్గురు డిస్కషన్ చేసుకోవాలని ట్రాష్ గ్రూప్ సభ్యులకి బిగ్ బాస్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో చాలాసేపు డిస్కషన్ తర్వాత గీతు రాయల్.. క్లాస్ గ్రూప్ కి వెళ్లడం జరిగింది. దీంతో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్టుంది. అనంతరం ట్రాష్ గ్రూప్ లో ఉన్న రేవంత్ రెండో చాలెంజింగ్ టాస్క్…”స్లైడ్ జార స్లైడ్” టాస్క్ లో గెలవడంతో మాస్ గ్రూప్ కి వచ్చేసాడు. అదే టాస్క్ లో ఓడిపోయిన అభినయశ్రీ..ట్రాష్ కి చేరుకుంది.
అంతకుముందు క్లాస్ గ్రూప్ కి గితూ రావటంతో బాలాదిత్య..ట్రాష్ గ్రూప్ కి రావడానికి ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత రెండో చాలెంజింగ్ టాస్క్ లో నేహా చౌదరి…ఇనయా సుల్తానాపై గెలవడంతో ఆమె క్లాస్ గ్రూప్ లోకి వచ్చేసింది. ఈ పరిణామంతో క్లాస్ గ్రూపులో ఉన్న సూర్య మాస్ లోకి వచ్చేసాడు.
అయితే రెండో రోజు ఛాలెంజింగ్ టాస్క్ లు… గ్రూప్ డిస్కషన్ లో జరిగిన తర్వాత బిగ్ బాస్.. ఎపిసోడ్ చివరిలో క్లాస్, ట్రాష్, మాస్ టాస్క్ కంప్లీట్ అయినట్లు ప్రకటించారు. దీంతో క్లాస్ గ్రూపులో ఉన్న గీతూ రాయల్, ఆదిరెడ్డి, నేహా ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ నుండి తప్పించుకున్నట్లు సేఫ్ జోన్ లో ఉన్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు. ఇక ట్రాష్ గ్రూప్ లో బాలాదిత్య, ఇనయా సుల్తానా, అభినయశ్రీ ఉండటంతో ఈ ముగ్గురు… మొదటివారం ఎలిమినేషన్ కి నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ఫస్ట్ టైం చేశారు.