Bigg Boss Season 6 Day 2 First Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన నాటినుండి ఎక్కువగా వినిపిస్తున్న పేరు గీతు రాయల్. మొదటి రోజే ఇంటిలో ఉన్న సభ్యులందరితో గొడవలకు దిగిన గీతు రాయల్.. నిన్న ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యే ట్రాష్ గ్రూప్ లో ఉండటం తెలిసిందే. ఇది ఇలా ఉంటే రెండో రోజు ఎపిసోడ్ కి సంబంధించి.. విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ క్లాస్ గ్రూపు కి చెందినవాలల్లో ఎవరు..ట్రాష్ కి వెళ్తారు అని ప్రశ్నించగా దానికి క్లాస్ గ్రూపులో ఉన్న బాలాదిత్య ఓకే చెప్పడం జరిగింది. దీంతో ట్రాష్ గ్రూప్ లో ఉన్న గీతు రాయల్.. క్లాస్ గ్రూపుకి వెళ్లడంతో సకల సౌకర్యాలు అనుభవించే అవకాశం లభించడంతో ఇంటి సభ్యులతో ఒక్కొక్కరితో ఒక ఆట ఆడుకున్నట్లు ప్రోమోలో కనిపిస్తుంది.

సోఫా లోనే కూర్చున్న గీతు రాయల్.. చాలామందికి వివిధమైన పనులు చెప్పడం జరిగింది. కనీసం కాలు కదపకుండా ప్లేట్ లోనే చేతులు కడుగుకొని మరి.. చాలామందికి పనులు చెప్పింది. అయితే మొదటి రోజు గీతు రాయల్…కి ఇనయా సుల్తానా మధ్య గొడవ జరగడం తెలిసిందే. బాత్రూంలో వెంట్రుకలు నీవే అని గీతు.. ఇనయా సుల్తానాతో… గొడవకు దిగింది. ఇద్దరి మధ్య గట్టిగానే మాటలు యుద్ధం నడిచింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు.. క్లాస్ గ్రూపులో గీతు.. రావటంతో మరోసారి ఇనయా సుల్తానా నీ టార్గెట్ చేసింది.

Bigg Boss Season 6 Day 2 First Promo: ఇంటిలో పనులు చెబితే చేస్తా..!
బాత్రూంలో ఉన్న ఇనయా సుల్తానా..నీ పిలిపించి మరీ తనకి లెమన్ వాటర్ తయారు చేయాలని ఆర్డర్ వేసింది. అనంతరం తనకోసం పాటలు పాడాలని రైమ్స్ చెప్పాలని తెలపడంతో..ఇనయా సుల్తానా ఒక్కసారిగా గీతు మీద సీరియస్ అయింది. పాటలు పాడాలని రూలేమీ లేదు. ఇంటిలో పనులు చెబితే చేస్తానని సుల్తానా తెలిపింది. దీంతో తన దువ్వెన తీసుకురావాలని గీతు ఆర్డర్ వేసింది. ఇంతలోనే బజార్ మొగటంతో గీతు.. అప్పుడే టాస్క్ అయిపోయిందా అని షాక్ అయింది. రెండో రోజు ఎపిసోడ్ కి సంబంధించి రిలీజ్ అయిన మొదటి ప్రోమోలో గీతు వర్సెస్ సుల్తానా గొడవ ఇంకా హౌస్ లో రన్ అవుతున్నట్లు తెలుస్తోంది.