Bigg Boss Season 6 Day 12 Second Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారం కెప్టెన్సీ పోటీ దారులు ఎవరికి వారు ప్రచారంలో మునిగిపోయారు. చంటి, సూర్య, రాజ్, సుల్తానా నలుగురు బిగ్ బాస్ పోటీదారులుగా గెలవడం జరిగింది. ఈ క్రమంలో నాచో నాచో టాస్క్ లో.. కెప్టెన్ కావడానికి ఈ నలుగురు ప్రచారంలో మునిగితేలుతున్నారు. నన్ను గెలిపిస్తే బెల్ కొట్టిన అరగంట సేపుకి కూడా లేపను అని చంటి హామీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిల రాజ్యం రావాలి.. హౌస్ లో ఉన్న అమ్మాయిలందరూ మద్దతు ఇవ్వాలి అని సుల్తానా తన ప్రచారం చేసింది.

ఇంకా రాజ్ తన హామీలను ఇచ్చే విషయంలో మాట తడబడడంతో .. చంటి మిగతా పోటీ దారులు కామెడీ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు ఇద్దరుగా తమ మద్దతు తెలియజేయడం జరిగింది. గీతూ రాయల్-రేవంత్, శ్రీ సత్య- వాసంతి, షానీ-శ్రీహాన్, అర్జున్ – ఫైమా తమ అభిప్రాయాలను తెలియజేసినట్లు ప్రోమోలో చూపించారు. అయితే ప్రోమో చివరిలో సూర్య… వెన్నుపోటు పొడిచాడు అని నువ్వు చెప్పావు. ఇప్పుడు కల్లారా చూశాను అంటూ డైలాగ్ వేయటం సంచలనంగా మారింది.

మొత్తం మీద చూసుకుంటే గురువారం ఎపిసోడ్ లో ఒకపక్క డాన్సులు చేస్తూనే మరో పక్క కెప్టెన్సీ టాస్క్ ఇంటి సభ్యుల చేత బిగ్ బాస్ ఆడించడం జరిగింది. మరి రెండవ వారం సీజన్ సిక్స్ లో ఎవరిని ఇంటి సభ్యులు కెప్టెన్ చేశారో మరికొద్ది క్షణాల్లో తెలియనుంది. ఒకపక్క బిగ్ బాస్ లైవ్ స్ట్రీమింగ్ అవుతూ ఉండటంతో ముందుగానే ఎపిసోడ్ కి సంబంధించిన హైలెట్ లు.. సోషల్ మీడియాలో వస్తూ ఉండటం ఈ సీజన్ కి పెద్ద మైనస్.