Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6 12వ రోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా తర్వాత జాలీగా జరిగింది. బేబీకి సంబంధించిన అనుబంధం గురించి ఇంటి సభ్యులు తెలియజేయాలని బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాలు.. హౌస్ లో చాలామందిని కంటతడి పెట్టించేలా చేశాయి. చాలామంది తమ జీవితంలో విషాద గాధలను తెలియజేశారు. అందరికంటే ఎక్కువగా కీర్తి స్టోరీ చాలామందిని కన్నీరు పెట్టించేలా చేసింది. 2017 వ సంవత్సరంలో ఓ ప్రమాదంలో కుటుంబ సభ్యులందరినీ పోగొట్టుకోవడం జరిగిందని పేర్కొంది.

అయితే ఆ సమయంలో దాదాపు 32 రోజులపాటు కోమాలోకి వెళ్లిపోవడం జరిగింది. ఆ తరువాత హాస్పిటల్ లో కోలుకున్నాక కళ్ళు తెరిచి చూసేసరికి నన్ను ఎవరైనా కేర్ తీసుకుంటారేమో అని ఎదురు చూశాను ఎవరూ లేరు. ఆ సమయంలో ఎంతగానో గుక్క పెట్టి ఏడిచాను. హాస్పిటల్ నుండి బయటకు వచ్చాక కొద్ది డబ్బులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ సమయంలో ఎంతో ఆకలేసింది చివరాఖరికి కుక్కకు పెట్టే బ్రెడ్ తినాల్సి వచ్చింది. అయితే తన జీవితంలో మంచి కాన్ఫిడెంట్ ఇచ్చింది.. దత్తత తీసుకున్న పాపా అని తెలిపింది.
పాప వచ్చాక జీవితంలో అనేక విషయాలు జరిగాయని కీర్తి తెలిపింది. కానీ సరిగ్గా షో కి వచ్చే ముందు పాపకి శ్వాసకి సంబంధించి హెల్త్ ఇష్యూస్ వల్ల పాపను కూడా కోల్పోవాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకుంది. ఒకవేళ పెళ్లయిన తర్వాత పిల్లలు కలగొచ్చేమో అన్న ఆశ కూడా లేదు. ఎందుకంటే నాకు జరిగిన మేజర్ ఆక్సిడెంట్ కారణంగా చికిత్స సమయంలో గర్భసంచి కూడా తీసేయవలసి వచ్చింది. అందువల్లే నాకు పెళ్లయిన కానీ పిల్లలు కలగరు. అయినా గాని నేను బయటికి వెళ్ళాక మరొక పాపని దత్తత తీసుకుంటాను అని కీర్తి చెప్పుకొచ్చింది.