Bigg Boss Season 6 Day 11 Episode Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 12వ రోజు ఎపిసోడ్ మొదటి ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో సిసింద్రీ టాస్క్ లో ఇచ్చిన బేబీ లతో కలిగిన అనుబంధం గురించి ఈ క్రమంలో మీ జీవితంలో ఒక బేబీ ఉండటం, ఆమె మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో అనుకుంటున్నారో ఇంటి సభ్యులు తెలియజేయాలని బిగ్ బాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుదీప తన థైరాయిడ్ వల్ల బేబీని కోల్పోయినట్లు చేదు విషయాన్ని తెలియజేసింది. ఆ తర్వాత రేవంత్ తన వైఫ్ 7 మంత్ ప్రెగ్నెంట్ అని.. తెలిపాడు. “నాన్న” అనే పదం పిలిపించుకోవడానికి ఎంతో ఎదురు చూస్తున్నట్లు తెలియజేయడం జరిగింది.
ఆ తర్వాత కీర్తి తన విషాద గాధని తెలియజేసింది. హౌస్ కి వస్తున్న సమయంలో తన దగ్గర పెంచుకుంటున్న పాప కూడా వెళ్లిపోయినట్టు ఇంటి సభ్యులకు తెలియజేసింది. ఇంకా రోహిత్- మేరీనా తమకు ఆల్రెడీ పాప పుట్టినట్లు గుండె సంబంధిత వ్యాధితో బేబీని కోల్పోయినట్లు తెలిపారు. అనంతరం శ్రీ సత్య ఇప్పుడు తల్లిదండ్రులవుతున్న వాళ్లు పిల్లలను గట్టిగా పట్టించుకోవాలని తెలిపింది.
ఆ తర్వాత చంటి తన కళ్ల ఎదుటే తల్లి చనిపోయినట్లు తెలియజేశారు. ఆ తర్వాత తనకి ఇద్దరు కూతుళ్లు ఇచ్చినట్లుగా చంటి చెప్పుకు రావడం జరిగింది. చాలామంది స్టోరీలు విన్న రేవంత్ బాత్రూం వద్ద.. పగవాడికి కూడా ఇటువంటి కష్టాలు రాకూడదని.. చివరిలో డైలాగ్ వేయటం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే బిగ్ బాస్ 12వ రోజు ఎపిసోడ్ లో.. హౌస్ మేట్స్ తమ విషాద గాధలను చెబుతున్నట్లు తెలుస్తుంది.