Bigg Boss Season 6 Day 10 First Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ కి “సిసింద్రీ” టాస్క్ పోటీ పెట్టడం జరిగింది. ఇప్పటికే ఈ టాస్క్ లో మొదటి కెప్టెన్ పోటీదారుడిగా చంటి గెలవడం జరిగింది. దీంతో బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో.. ఎంతమంది కెప్టెన్సీ పోటీ దారులుగా గెలుస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. కాగా అర్ధరాత్రి ఎవరికివారు బేబీ లను జాగ్రత్తగా ఉంచుకోవాలని… బిగ్ బాస్ ఇంటి సభ్యులకు నిన్ననే ఆదేశాలు ఇవ్వటం తెలిసిందే.
ఈ క్రమంలో బుధవారం ప్రసారం కాబోయే బిగ్ బాస్ పదవరోజు ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమోలో నిద్రపోతున్న ఇంటి సభ్యుల బేబీ బొమ్మలను దొంగలించడంలో గీతు.. ఇంటి సభ్యులకు చుక్కలు చూపించింది. శ్రీహాన్ మరి కొంతమంది ఇంటి సభ్యుల బొమ్మలను… గీతు దొంగిలించినట్లు ప్రోమోలో చూపించారు. గీతు ఆడిన ఆటకి.. ఇంటి సభ్యులు రాత్రంతా జాగారం చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా మిగతా ఇంటి సభ్యుల బొమ్మలను దొంగలించడానికి చాలామంది ట్రై చేయడం జరిగింది. ఈ క్రమంలో శ్రీహాన్… తోటి కంటెస్టెంట్ అర్జున్ బేబీని దొంగలించాడు. దీంతో శ్రీహాన్ కి అర్జున్ కి మధ్య కొద్దిగా డిస్కషన్ జరిగింది. ఇప్పటికే రెండో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో రేవంత్, అభినయశ్రీ, శ్రీ సత్య అనర్హులయ్యారు. బుధవారం ఎపిసోడ్ ప్రోమో బట్టి చూస్తే ఈ లిస్టులోకి శ్రీహాన్, అర్జున్ కూడా అనర్హులు అయినట్లు తెలుస్తోంది.