Bigg Boss Season 6 Day 1 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటి రోజు ఎపిసోడ్ మొత్తంగా చూసుకుంటే మొదటి టాస్క్ తోనే బిగ్ బాస్ తన చేతికి మట్టి అంటకుండా.. ఇంటి సభ్యుల మధ్య చిచ్చుపెట్టే తరహా వాతావరణం సృష్టించారు. మాస్, క్లాస్, ట్రాష్ గ్రూపు సభ్యులుగా ఏర్పడాలని.. ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే క్లాస్ గ్రూపు సభ్యులకు సంబంధించి వాళ్ళు ఈ వారం అసలు ఎలిమినేట్ అవ్వరు..హౌస్ నుండి బయటకు వెళ్లారు. పైగా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.
ఇంకా ట్రాష్ గ్రూప్ కి చెందిన వాళ్లు.. నేరుగా ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఆదేశాలలో తెలపడం జరిగింది. మిగిలిన మాస్ గ్రూప్ లో వాళ్లు క్లాస్ అయ్యే అవకాశాలు టాస్కుల ద్వారా కల్పించడంతో..షో రసవతరంగా సాగింది. ఈ క్రమంలో మొదటి చాలెంజింగ్ టాస్క్ మాస్ గ్రూప్ లో ఉన్న ఆదిరెడ్డి.. ట్రాష్ గ్రూప్ లో ఉన్న ఇనయా సుల్తానాతో కొబ్బరి బొండంతో యుద్ధం గేమ్ ఆడటం జరిగింది.
Bigg Boss Season 6 Day 1 Highlights: గత సీజన్ లకు బిన్నంగా నామినేషన్ ప్రక్రియ..!!
ఈ క్రమంలో ఈ టాస్క్ లో ఆదిరెడ్డి గెలవటం తెలిసిందే. సో మొత్తానికి చూసుకుంటే మొదటి రోజు ఈ గ్రూపు గేమ్ తో… ఇంటి సభ్యుల మధ్యే గొడవలు చాలా తెలివిగా బిగ్ బాస్ పెట్టాడని చెప్పవచ్చు. మామూలుగా డిస్కషన్ తో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ గత సీజన్లలో మనం చూశాం. కానీ ఈసారి ఆ రకంగా కాకుండా గ్రూపులుగా క్రియేట్ చేసి టాస్కులు పెట్టి.. బిగ్ బాస్.. ఆడియన్స్ కి షోపై మరింత ఇంట్రెస్ట్ కలిగించేటట్లు చేయటంలో కొద్దిగా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.