Bigg Boss Season 6 Day 1 Highlights: తెలుగు బిగ్ బాస్ సీజన్ లలో చాలా లవ్ ట్రాక్ లు నడిచాయి. ప్రారంభం నుండి అనేక సీజన్ లలో… హౌస్ లో ఎంట్రీ సింగిల్ గా ఇచ్చిన సభ్యులు.. జంటలుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాహుల్ సిప్లిగంజ్.. పునర్నవి, అఖిల్.. మోనాల్, గత సీజన్ లో షణ్ముక్..సిరి మద్య సంథింగ్ సంథింగ్ అన్న తరహాలో ప్రొజెక్టు కావటం జరిగింది. హౌస్ లో పరిస్థితి ఇలా ఉంటే వీళ్లంతా బయటకు వచ్చాక మేమంతా ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చేవారు. ఇదిలా ఉంటే సీజన్ సిక్స్ ఆదివారం స్టార్ట్ అవ్వటం తెలిసిందే. అయితే సోమవారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో రకరకాల కోణాలు బయటపడ్డాయి.
ఈ క్రమంలో సూర్య ఇంకా కీర్తి కేశవ్ బట్ మధ్య జరిగిన సంభాషణ బట్టి.. చూస్తే బయట టాక్ వెరైటీగా వినిపిస్తుంది. వారిద్దరి మధ్య జరిగిన డిస్కషన్.. “సూర్య.. కీర్తి వేసుకున్న వైట్ షర్ట్ చూసి సేమ్ ఇటువంటి షర్ట్ నా దగ్గర ఉంది.. అని కీర్తితో చెబుతాడు. దానికి కీర్తి మరి ఇప్పుడు వేసుకోవచ్చు కదా అని అంటది. సూర్య ఇప్పుడు కాదు రేపు వేసుకుంటాను. ఎవరైనా .. నా షర్ట్ చూసి ఇది కీర్తి షర్ట్ లాగా ఉంది అంటే అవును అని అంటాను. ఇంకేంటి పిచ్చి అని సూర్య అంటే అది నా ఫేవరెట్ పదమని కీర్తి..” చెప్పటంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచే అవకాశాలు ఉన్నట్లు బయట టాక్ గట్టిగా వినిపిస్తోంది.
Bigg Boss Season 6 Day 1 Highlights: ఒకే ప్రమాదంలో చనిపోవడం అదే ప్రమాదంలో కీర్తి కోమా లోకి..
కీర్తి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన అమ్మాయి. ఇనయా సుల్తానా తన తండ్రి చనిపోయాడని అనేక విషయాలు చెప్పిన క్రమంలో కీర్తి చాలా ఎమోషనల్ అయిపోయి చాలా కన్నీరు పెట్టుకోంది. కీర్తి తల్లిదండ్రులు ఇంకా రక్తసంబందులు ఒకే ప్రమాదంలో చనిపోవడం అదే ప్రమాదంలో కీర్తి కోమా లోకి వెళ్ళటం జరిగింది. దీంతో సూర్యకి మరియు కీర్తికి మధ్య ఖచ్చితంగా బాండింగ్ ఈ సీజన్ సిక్స్ లో క్రియేట్ అయ్యే అవకాశాలున్నట్లు చూసే జనాలు అంటున్నారు.