Bigg Boss Season 6 Day 1 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటి ఎపిసోడ్ కవరేజ్ చాలా వరకు కంటెస్టెంట్ గీతూ రాయాల్ కి లభించింది. కారణం చూస్తే బెస్ట్ పెర్ఫార్మన్స్ కాదు ఆమె ఇతర ఇంటి సభ్యులతో అనవసరమైన గొడవలు పెట్టుకోవడం. మొదటి ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే.. బాత్రూంలో వెంట్రుకలు ఉన్నాయని నానా యాగి చేసింది. పొద్దు పొద్దున్నే ఇనయా సుల్తానా నీ టార్గెట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మిగతా ఇంటి సభ్యులు గీతూ రాయల్ నీ కంట్రోల్ చేయాలని చూసినా గాని.. ఆమె తగ్గేదేలే అన్న తరహాలో రెచ్చిపోయింది.
ఒక్క ఇనయా సుల్తానాతో మాత్రమే కాదు సింగర్ రేవంత్ పట్ల ఇంకా చాలామంది కంటెస్టెంట్లతో దురుసుగా ప్రవర్తించింది. మొదటి ఎపిసోడ్ లో గీతు రాయల్.. గొడవలతో హౌస్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ పరిణామంతో ఆమెనీ… మొదటి టాస్క్ లో భాగంగా..ట్రాష్ గ్రూప్ లోకి చాలామంది పెట్టడంతో ఆమె నేరుగా ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యింది. ఈ పరిణామం తర్వాత మరింత ఫ్రస్టేషన్ కి గురైన గీతు రాయల్.. తోటి కంటెస్టెంట్లపై మరింత రెచ్చిపోయింది.
Bigg Boss Season 6 Day 1 Highlights: ఇలాగైతే హౌస్ నుండి తొందరగానే వెళ్ళిపోతోంది.
ట్రాష్ గ్రూప్ కి చెందిన వాళ్లు.. జీవితంలో వారిని చూసి గర్వపడే వాళ్ల గురించి చెప్పాలని టాస్క్ ఇచ్చిన క్రమంలో మరింత ఎమోషనల్ అయ్యి.. సింపతి సంపాదించడానికి తెగ ట్రై చేసింది. అయినా గాని ఆమె వ్యవహరించిన తీరు పెద్దగా వర్క్ అవుట్ కాలేదని చెప్పవచ్చు. మొత్తం మీద మొదటి ఎపిసోడ్ లో గీతు రాయల్ వ్యవహరించిన తీరుబట్టి తొందరగానే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అని బయట జనాలలో టాక్ వినిపిస్తోంది.