బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ మొదటి వారంలో ఆరంభం కాబోతుంది. ఇప్పటిలాగే ఈ సారి కూడా బిగ్ బాస్ షో పై చాలా హైప్ ఉంది. ఎవరు హౌస్ లోకి వెళ్ళబోతున్నారు అనే విషయం ఆసక్తిగా మారింది. గత కొద్ది రోజులుగా చాలా మంది పేర్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారని వినిపిస్తూ వస్తున్నాయి. అయితే అలా వినిపించిన వారి పేర్లు ఫైనల్ కి వచ్చేసరికి ఉండటం లేదు. ఇప్పటిలాగే ఈ సారి కూడా అలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నా వారి అంటూ యాంకర్ ఉదయభాను పేరు వినిపించింది. అయితే ఆమె హౌస్ లోకి వెళ్లడం లేదని తెలుస్తుంది. అలాగే సింగర్స్ కపుల్స్ అయిన శ్రావణ భార్గవి-హేమ చంద్ర కూడా హౌస్ లోకి వెళ్లడం లేదు.
తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే వారి ఫైనల్ జాబితా సిద్ధం అయ్యింది. ఈ సారి కొంత ఆసక్తికరంగానే హౌస్ లోకి వెళ్లే కంటిస్టెంట్ ల జాబితా ఉంది. వీరిలో ఫేడ్ అవుట్ అయ్యి మళ్ళీ సినిమాలలో అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు. అలాగే ఇప్పుడిప్పుడే కెరియర్ మొదలు పెట్టి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వారు కూడా ఉన్నారు. అలాగే యుట్యూబ్ స్టార్స్, సోషల్ మీడియా ద్వారా ఫేమ్ తెచ్చుకున్న జంటలు కూడా బిగ్ బాస్ హౌస్ కోసం ఖరారు అయ్యారు.
ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారని బయట వినిపిస్తున్న వారి జాబితా చూసుకుంటే ఇలా ఉంది. ఆర్య సినిమాలో ఐటం సాంగ్‌తో ఆకట్టుకున్న అభినయశ్రీ, రాంగోపాల్ వర్మ బ్యూటీ ఇనయ సుల్తానా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ పింకీ (సుదీప), నటుడు బాలాదిత్య, జబర్దస్త్ కమెడియన్లు చలాకీ చంటి, ఫైమా, గలాటా గీతూ, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డి, వాసంతి కృష్ణన్, నటుడు శ్రీహాన్, తన్మయ్, శ్రీసత్య, యాంకర్ ఆరోహి రావు, బుల్లితెర జోడీ రోహిత్ – మెరీనా అబ్రహం, అర్జున్ కల్యాణ్, కామన్ మ్యాన్ రాజశేఖర్, యాంకర్ దీపిక పిల్లి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ రోజుకి వీరిలో ఎవరు ఖరారు అవుతారనేది చూడాలి.