Bigg Boss Season 6: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షో.. బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది. తెలుగులో ఇప్పటికీ 5 సీజన్ లు దిగ్విజయంగా కంప్లీట్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆరో సీజన్ ఏ రీతిగా ఉంటుందో అని ఉత్కంటబరీతంగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ఆడియన్స్ ఉత్కంఠకు షో నిర్వాహకులు తెరాదించేశారు. ఆదివారం సాయంత్రం ఆరో సీజన్ అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. బిగ్ బాస్ లో పోటీపడే కంటెస్టెంట్ లు.. ఎవరికి వారు తమదైన శైలిలో ఎంట్రీ సాంగులకు స్టెప్పులు వేసి అదరగొట్టారు.
ఇదే సమయంలో హోస్ట్ నాగార్జున.. ప్రతి ఒక్కరిని పలు ప్రశ్నలు వేయటం మాత్రమే కాదు హౌస్ లోకి పంపించే ముందు పలు టాస్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే 13వ కంటెస్టెంట్ గా నటి వాసంతి కృష్ణన్ అదరగొట్టే స్టెప్పులతో ఎంట్రీ ఇచ్చింది. మోడలింగ్ రంగంలో రాణించి.. ఆ తర్వాత కన్నడ సినిమాలు చేసిన వాసంతి సిరిసిరిమువ్వలు అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. సంపూర్ణేష్ బాబు నటించిన క్యాలీఫ్లవర్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కిన “వాంటెడ్ పండుగాడు” సినిమాలో కూడా వాసంతి కృష్ణన్ నటించింది.

Bigg Boss Season 6: అబ్బాయిలలో ఆ క్వాలిటీ ఉంటే ఎంతో ఇష్టం…
తాజాగా ఈ ముద్దుగుమ్మ హౌస్ లో మంచి ఎనర్జిటిక్ సాంగ్ తో.. ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అనంతరం తన గురించి అనేక వక్తిగత విషయాలు తెలియజేసి తనకు ఇంకా పెళ్లి కాలేదని క్లారిటీ ఇచ్చింది. తనకు కాబోయే డ్రీమ్ బాయ్ చాలా నిజాయితీగా ఉండాలని.. అబ్బాయిలలో ఆ క్వాలిటీ ఉంటే ఎంతో నచ్చుతుందని నటి వాసంతి కృష్ణన్ తెలియజేసింది. అనంతరం వాసంతికి ఆల్ ది బెస్ట్ తెలియజేసి హౌస్ లోకి నాగార్జున పంపించారు.