Bigg Boss Season 6: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నావ్ తెలుగు బిగ్ బాస్ ఆడియన్స్ టైం వచ్చేసింది. సీజన్ సిక్స్ తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది. కాగా తెలుగు బిగ్ బాస్ హౌస్ లో చాలా వరకు ఫైనల్ దాక వెళ్లిన గ్రాఫ్ గత సీజన్లను పరిశీలిస్తే ఎక్కువగా సింగర్స్ ఉన్నారు. సీజన్ 3 టైటిల్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఇక గత సీజన్ లో చూసుకుంటే సింగర్ శ్రీరామచంద్ర.. టాప్ త్రీ లో నిలిచాడు. తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 6 ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈసారి సీజన్ లో సింగర్ రేవంత్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
21వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు. గతంలో ఇండియన్ ఐడి టైటిల్ కైవాసం చేసుకోనీ దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యాడు. కెరియర్ పరంగా దాదాపు 200 కు పైగా పాటలు పాడిన రేవంత్.. చాలామంది ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ల వద్ద పనిచేయడం జరిగింది. శ్రీకాకుళం లో పుట్టిన రేవంత్ తన పాఠశాల మరియు కళాశాల చదువు మొత్తం విశాఖపట్నంలోనే కంప్లీట్ చేశాడు.
Bigg Boss Season 6: ఇండియన్ ఐడిల్ 9 లో టైటిల్ గెలిచిన రేవంత్…
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన “బాహుబలి” లో మనోహరి పాటతో.. మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో స్టేజ్ పై రేవంత్ రాగానే నువ్వు మంచి ప్లే బాయ్ అంట కదా… అంటూ నాగార్జున ప్రశ్న వేయగా ఈషో భార్య చూస్తుందంటూ… తనదైన శైలిలో వెరైటీగా సమాధానం ఇచ్చాడు. 2017వ సంవత్సరం సోనీ మ్యూజిక్ నిర్వహించిన ఇండియన్ ఐడిల్ 9 లో టైటిల్ గెలిచిన రేవంత్ తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఏ మేరకు రానిస్తారో చూడాలి.