Bigg Boss Season 6: బిగ్ బాస్ షో అంటే తెలియని ప్రేక్షకులుండరు. విదేశాల్లో పుట్టిన ఈ షోను హిందీలో గత కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్‌గా నిర్వహిస్తూ వస్తున్నారు. దక్షిణాదిలోనూ ఈ బిగ్ బాస్ కల్చర్ ఎక్కువైంది. ప్రతీ భాషలోనూ బిగ్ బాస్ షో హిట్ అయింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ షో హిట్ అయింది. ఇప్పుడు తెలుగులో ఆరో సీజన్ ప్రారంభమైంది. ఈ షోను ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు గ్రాండ్‌గా ప్రారంభించారు.

నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. పాటలతో మార్మోగించాడు. ఒక్క ఏరియాను వివరించి చూపించాడు. అయితే ఈ ఇంట్లోకి మొదటి కంటెస్టెంట్‌గా కార్తీక దీపం హిమగా ఫేమస్ అయిన కీర్తి భట్ ఎంట్రీ ఇచ్చింది. గాంధారీ గాంధారీ అనే పాటకు స్టెప్పులు వేస్తూ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సుదీప ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత శ్రీహాన్ ఎంట్రీ ఇచ్చాడు.

Bigg Boss Season 6: సీజన్ చూశావ్.. చూసి కూడా ఎలా వచ్చావ్?
మాస్ సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ వచ్చిన శ్రీహాన్‌ను మొదట్లో నాగ్ ఇరికించే ప్రయత్నం చేశాడు. గత సీజన్ చూశావ్.. చూసి కూడా ఎలా వచ్చావ్ అని అడిగేశాడు. సిరి సిరి అంటూ శ్రీహాన్‌ను ఏడిపించేశాడు నాగార్జున. అయితే నాగ్ అడిగిన ప్రశ్నకు శ్రీహాన్ ఎంతో మెచ్యూర్‌గా సమాధానం చెప్పాడు. సిరి కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వడానికే వచ్చాను అని అన్నాడు. ఇక సిరి ఏమైనా సలహాలు ఇచ్చిందా? అని నాగార్జున అడిగితే.. తన సలహాలు ఏమీ వద్దని చెప్పినట్టు తెలిపాడు. ఆ తరువాత ఇంట్లోకి వెళ్లిన శ్రీహాన్.. నేరుగా బాత్రూంలోకి వెళ్లిపోయాడు. అక్కడ పోసుకున్న తరువాత బయటకు వచ్చాడు. దీంతో కీర్తి, సుదీపలు తెగ నవ్వేసుకున్నారు. గంట సేపు నుంచి ఆపుకున్నానంటూ అందరినీ నవ్వించేశాడు.