Bigg Boss Season 6: తెలుగు బిగ్ బాస్ షోకి జబర్దస్త్ కామెడీ షోకి అభినవభావ సంబంధం ఉంది. జబర్దస్త్ షో తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనం అని అందరికీ తెలుసు. ఈ షోలో బాగా పాపులర్ రైతే ఇంకా సదరు కంటెస్టెంట్ కెరియర్ కి తిరుగుండదు. “జబర్దస్త్ షో” చాలామందికి లైఫ్ ఇవ్వటం జరిగింది. ఈ షో నుండి చాలామంది కమెడియన్ లు.. తెలుగు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లుగా పోటీ పడటం జరిగింది. ముక్కు అవినాష్ ఇంకా స్టార్టింగ్ లో ధనరాజ్ వంటి వాళ్లు బిగ్ బాస్ షోలో గతంలో పోటీపడ్డారు.

కాగా ఈసారి లేడీ కమెడియన్ గా పేరు సంపాదించిన..ఫైమా వంతు వచ్చింది. జబర్దస్త్ స్టేజిపై లేడీగా..ఫైమా కామెడీ టైమింగ్ చాలా హైలెట్ గా ఉంటుంది. జబర్దస్త్ షో కి రాకముందు ఈటీవీ ప్లస్ లో యాంకర్ రవి మరియు శ్రీముఖి ఆధ్వర్యంలో నడిచే పటాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత జబర్దస్త్ షోలో బుల్లెట్ భాస్కర్ టీంలో రాణించింది. అనంతరం “పోవే పోరా” షోలో కూడా ఫైమా క్రేజ్ సంపాదించింది.

Bigg Boss Season 6: 35 సంవత్సరాలగా రెంటు ఇంట్లో..
కామెడీ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఫైమా బిగ్ బాస్ సీజన్ 6లో 17వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. మంచి మాస్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన ఫైమా.. స్టేజి పైనే నాగార్జున ముందే తాను ప్రేమలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. కమెడియన్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్లు స్పష్టం చేసింది. గత 35 సంవత్సరాల నుండి తమ కుటుంబం అదే ఇంటిలోనే ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. కాబట్టి తన కుటుంబానికి ఇల్లు కట్టించడమే జీవిత లక్ష్యంగా.. కెరియర్ సాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఫైమాకి హోస్ట్ నాగార్జున ఆల్ ది బెస్ట్ చెప్పి.. హౌస్ లోకి పంపించారు.