Bigg Boss Review: స్టార్ మా తెలుగు టెలివిజన్ లో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సండే ఎపిసోడ్ ఎప్పటిలాగే నార్మల్ గా కొనసాగింది. ఈ సండే కొత్తగా చెప్పుకోవాల్సినంత ప్రత్యేకంగా ఏమీ లేదనే చెప్పవచ్చు. ఎప్పటిలాగే హోస్ట్ గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీదకు గ్రాండ్ గా సాంగ్ తో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. నాగార్జున ఎంట్రీ తర్వాత మిల్కి బ్యూటీ తమన్నా బిగ్ బాస్ స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చింది. తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ లో సందడి చేశారు.
బబ్లీ బౌన్సర్ కు సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్ ను బిగ్ బాస్ షోలో ప్రదర్శించారు. తమన్నాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ షో తరపున ఓ గిప్ట్ కూడా అందించారు. అనంతరం నాగార్జున బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను తమన్నాకు ఒకరి తర్వాత ఒకరిని పరిచయం చేశారు. తమన్నా హౌస్ లోకి వెళ్లడం ఈ ఆదివారం ఎపిసోడ్ ఓ చిన్నపాటి ప్రత్యేకం. ఎప్పటిలాగే ఈ తతంగం అంతా సరదా సరదాగా సాగింది. కంటెస్టెంట్స్ ఎవరికి వారు వారి ప్రతిభను చూపిస్తూ తమన్నాను పొగడ్తలతో ముంచెత్తారు. ఆమెను ఎంటర్ టైన్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బాగా ఎంటర్ టైన్ చేసిన సూర్యకు తమన్నా దగ్గర ఉన్న గిఫ్ట్ ను ఇచ్చింది. ఇంతటితో ఈ ఎపిసోడ్ తో తమన్నా వెళ్లిపోతుంది.
అనంతరం ఎలిమినేషన్స్ లో ఉన్న ఏడుగురిని వరుసగా హౌస్ నిల్చోబెట్టారు నాగార్జున. ఎలిమినేషన్స్ లో ఉన్న వారికి బొమ్మలను ఇచ్చి వారిలో ఎలిమినేషన్స్ స్టార్ట్ చేశారు. అందులో గీతూ రాయల్, రాజశేఖర్ సేఫ్ అయ్యారు. ఆది, మరీనన- రోహిత్ జంట, అభినయ, ఫైమా, రేవంత్ అన్ సేఫ్ గా మిగిలారు. ఆ తర్వాత హౌస్ సభ్యులను నాగార్జున రెండు టీంలుగా విడగొట్టి సాంగ్స్ ఐడెంటిఫై చేసే గేమ్ స్టార్ట్ చేశారు. దానికి గజిబిజి గాన అని పేరు పెట్టారు. రెండు టీమ్స్ లో ఒక టీం చంటి, మరో టీం రేవంత్ లీడర్స్ గా టీంలను ఏర్పాటు చేసి గేమ్ స్టార్ట్ చేశారు.
మధ్యలో గేప్ ఆపి మరలా ఎలిమినేషన్స్ స్టార్ట్ చేశారు. ఏడుగురిలో అన్ సేఫ్ అయిన ఐదుగురిని వరుసలో నిల్చబెట్టి మరలా ఎలిమినేషన్స్ స్టార్ట్ చేశారు. అందులో అభినయ, ఆది, మరీన- రోహిత్ జంట అన్ సేఫ్ అయ్యారు. ఫాతిమా, రేవంత్ సేఫ్ అయ్యారు. తిరిగి మరలా గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపి ఎలమినేషన్స్ స్టార్ట్ చేశారు. అందులో మరీన- రోహిత్ జంట సేఫ్ అయ్యారు. ఆది, అభినయ అన్ సేఫ్ అయ్యారు. ఇక గేమ్ మళ్లీ స్టార్ట్ చేసి సాంగ్స్ తో ఎంటర్ టైన్ చేశారు. ఈ గేమ్ లో రేవంత్ టీం విన్నర్ గా నిలిచింది. అనంతరం మరలా చివరి సారిగా ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇందులో అభినయ ఎలిమినేట్ అవగా, ఆది సేఫ్ అయ్యారు. ఎలిమినేట్ అయిన అభినయ హౌస్ లో నుండి బయటకి రావడంతో ఈ ఆదివారం ఎపిసోడ్ ముగిసింది.