Bigg Boss Review: బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు ఎపిసోడ్ లో ముందుగా శ్రీహాన్ తో పాటు హౌస్ సభ్యులు అందరూ బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఫ్రీజ్ లో ఉంటారు. సిరిబిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంది. శ్రీహాన్ దగ్గరికి వెళ్లి ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. శ్రీహన్ ఫ్రీజ్ లో ఉండి కన్ను కొడతాడు. శ్రీహాన్ కి సిరి ముద్దులు పెడుతుంది. ముద్దు పెట్టుకుని హగ్ చేసుకుంటుంది. ఈ సమయంలో బిగ్ బాస్ సిరి ఫ్రీజ్ అని చెప్తాడు. పాత పరిచయాలు నీకు బిగ్ బాస్ కి అని శ్రీహాన్ అంటాడు. ఐలవ్ యూ బిగ్ బాస్ అని సిరి అంటుంది. తర్వాత బిగ్ బాస్ ఫ్రీజ్ తీసేయడంతో ఇద్దరూ గట్టిగా కౌగిలించుకుంటారు. ఆ తరవాత శ్రీహాన్‌ని లోపలికి తీసుకుని వెళ్లిన సిరి.. ప్రియుడి పేరుని తన వీపుపై పచ్చబొట్టు పొడిపించుకున్నదాన్ని చూపించి సర్ ప్రైజ్ చేసింది.
ఇంతలో శ్రీహాన్-సిరిల కొడుకు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి చిచ్చరపిడుగులా చెలరేగాడు. హౌస్‌లో ఒక్కో కంటెస్టెంట్స్ ఎలా ప్రవర్తిస్తారో.. ఎలా మాట్లాడతారో చెప్పి ఆకట్టుకున్నాడు. రేవంత్.. నా క్యారెక్టర్ ఇంతే నేను ఇలాగే ఉంటా అని అంటాడని.. ఆదిరెడ్డి.. కవితా ఐ లవ్యూ అంటాడని.. చెప్పిన చైతూ.. నామినేషన్స్‌లో తన తండ్రి ఇనయతో గొడవపడినప్పుడు ఎలా అన్నాడో సేమ్ అలా దింపేశాడు.వాడు వీడు ఏంటి? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అంటూ శ్రీహాన్.. ఇనయపై సీరియస్ అయిన సీన్‌ని చేసి చూపించాడు బుడతడు. మొత్తానికి శ్రీహాన్-సిరి జోడీ చాలా క్యూట్‌గా అనిపించింది. ఆ పిల్లోడు అయితే అదరగొట్టేశాడు. కాసేపు శ్రీహాన్ తో డ్యాన్స్ చేసి హౌస్ లో నుండి బయటకు సిరి వెళ్లిపోతుంది. రాత్రి పాల గురించి రాజ్, రేవంత్ మధ్య డిస్కషన్ నడుస్తుంది.

మరుసటి రోజు ఉదయం టాస్క్ స్టార్ట్ అవుతుంది. యోగా టీచర్ గా రేవంత్ టాస్క్ స్టార్ట్ చేస్తారు. టాస్క్ చాలా ఫన్నీగా సాగుతుంది. మరోసారి ఇంటి సభ్యులను బిగ్ బాస్ ఫ్రీజ్ చేస్తాడు బిగ్ బాస్. కీర్తి రిలేటివ్ మహేష్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడు. బిగ్ బాస్ గేట్ లో నుండి ఏమండోయ్ భాను గారూ అంటూ కీర్తి ఫ్రెండ్ మహేష్ వస్తారు. ఇద్దరూ కలిసి గార్డెన్ ఏరియాలో డ్యాన్సులు వేస్తారు. కీర్తి ఫ్రెండ్ మహేష్ అందరితో సరదాగా కాసేపు మాట్లాడి వెళ్లిపోతాడు. మరలా టాస్క్ స్టార్ట్ అవుతుంది. శ్రీహాన్ క్లాస్ కు రాగానే గుడ్ మార్నింగ్ ఫ్లర్టింగ్ సార్ అని రాజ్ కామెడీ చేస్తాడు. స్టూడెండ్స్ లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అందులో నీవు ఎవరిని ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నావు అని రాజ్ ని శ్రీహాన్ అడుగుతాడు. నాకు ఏ అమ్మాయి అయినా పర్వాలేదు సార్ అని రాజ్ వేసిన పంచ్ కి హౌస్ మొత్తం గట్టిగా నవ్వుతారు. తర్వాత మనం పొగిడే పొగడ్తలకు అమ్మాయిలు ఇలా ఐస్ లా కరిగిపోవాలి అని డ్యాన్స్ చేస్తూ శ్రీహాన్ ఆదిరెడ్డికి చూపిస్తాడు. మనకు అది అలవాటు లేదని డ్యాన్స్ వేసి ఆదిరెడ్డి చూపిస్తాడు.
తర్వాత ఫైమాను ఉద్దేశించి ఆదిరెడ్డి మాట్లాడుతూ.. దెబ్బ ఏమీ తగల్లేదా అని అంటే ఫైమా అందుకు ఎందుకు అని అడుగుతుంది. స్వర్గం నుండి కింద పడేటప్పుడు అని ఆదిరెడ్డి డైలాగ్ వేస్తాడు. దీంతో సిగ్గుతో పోరా అని ఫైమా అక్కడి నుండి వెళ్లిపోతుంది. తర్వాత హౌస్ సభ్యులు అందరూ ఫ్రీజ్ లో ఉంటారు. ఆ తర్వాత ఇనయ వాళ్ల మమ్మి హౌస్ లోకి రావడాన్ని చూపిస్తారు. గెలిచి ఇంటికి రావాలి ఎదురు చూస్తుంటానుని ఇనయకు వాళ్ల మమ్మి చెప్పి కాసేపు ఉండి వెళ్లిపోతుంది. తర్వాత ఇనయన బిగ్ బాస్ కి కెమెరాతో ధ్యాంక్యూ చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.