Bigg Boss Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఈ రోజు ముందుగా ఫైమా వాళ్ల అమ్మ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ అవుతుంది. దీంతో ఫైమా హ్యాపీగా వాళ్ల అమ్మను రిసీవ్ చేసుకుంటుంది. అందరూ హే ఫైమా అంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నీవు ఇంగ్లీషు అందరికీ నేర్పిస్తున్నావు నాకు నేర్పించవా అని ఫైమాను వాళ్ల అమ్మ అడుగుతుంది. తర్వాత ఆంటీ నేను నేర్పిస్తా ఫస్ట్ అని శ్రీసత్య అనగానే నేర్పించు అని ఫైమా వాళ్ల అమ్మ అంటుంది. వెంటనే ఐ లవ్ యూ అని శ్రీసత్య అనడంతో ఫైమా అమ్మ ఆ అని నోరు వెల్లబోస్తుంది. దీంతో అందరూ నవ్వుతారు. ఫైమా కాకుండా నీ ఫేవరెట్ ఎవరో చెప్పండి అని శ్రీసత్య అడుగుతుంది. అందరూ నా ఫెవరెట్ అని ఫైమా అమ్మ అంటుంది. నీవు నన్ను చూస్తే నాకు భయమేస్తోందని అని రేవంత్ గురించి అంటుంది. దీంతో ఈ వారం మీరు ఇక్కడ ఉండి ఉంటే రేవంత్ నిన్ను నామినేట్ చేసి ఉండే వాడు అని శ్రీహాన్ అంటాడు. అందరూ ఫైమా అమ్మతో కాసేపు ఫన్ చేస్తారు.
తర్వాత ఫైమా అమ్మ వెళ్లిపోతుంది. మరుసటిరోజు ఉదయం మంచి సాంగ్ తో నిద్ర లేచిన హౌస్ సభ్యులను రివైండ్, ఫ్రీజ్ తో కాసేపు బిగ్ బాస్ ఆడుకుంటాడు. ఈ క్రమంలో శ్రీహాన్, రాజ్, శ్రీసత్య, ఫైమా బాగా ఎంటర్ టైన్ చేస్తారు. తర్వాత గార్డెన్ ఏరియాలో అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. కానీ శ్రీసత్య మాత్రం పేరెంట్స్ గుర్తుకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది అంతలోనే శ్రీసత్య అమ్మ, నాన్న వస్తారు. ఆనందం తట్టుకోలేక శ్రీసత్య ఏడ్చేస్తుంది. తర్వాత అందరూ కలిసి వాళ్లతో మాట్లాడుతూ ఉంటారు. నన్ను ఫస్ట్ వీక్ నామినేషన్ ఎందుకు వేశారో అని శ్రీసత్య చెప్పబోతుంది. నీవు కూడా పిచ్చి పిచ్చిగా నామినేషన్స్ వేస్తున్నావు అంటూ వేస్తున్నావని శ్రీసత్యను వాళ్ల డాడి అంటాడు. దీంతో శ్రీసత్య మొహం అదోలా పెడుతుంది.

రేవంత్ తో పాటు మరి కొందరు హౌస్ మెంట్స్ అందరూ అవును అన్నట్లుగా రియాక్షన్ ఇస్తారు. తర్వాత వాళ్లు బయటికి వెళ్లిపోతారు. తర్వాత మరలా టాస్క్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. టాస్క్ లో భాగంగా రాజ్ సింగింగ్ టీచర్ గా ఎంట్రీ ఇస్తాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ అందరూ కామెడీ చేస్తారు. నీకు వచ్చిన ఓ పాట పాడు అని ఫైమాను రాజ్ అడగుతాడు. పిల్లా అని ఫైమా స్టార్ట్ చేస్తుంది. దీంతో పిల్లా కాదు పిల్లా అని పాడాలి.. నీ పిచ్చి పైకి పోతుందని రాజ్ ఫైమాను అంటాడు. పిచ్చు కాదని పిచ్ అంటారు దాన్ని అని ఫైమా పంచ్ వేయడంతో హౌస్ లో అందరూ గట్టిగా నవ్వుతారు.
తర్వాత శ్రీహాన్ తో కలిసి లాలి లాలి లాలి వసతప్ర సాయికి వరహాల లాలి అని రాజ్ సాంగ్ పాడిస్తాడు. వసపత్ర కాదు వటపత్ర సాయికి అని రేవంత్ తప్పును సరిచేస్తాడు. నీవు నాకే చెప్తున్నావా అని రాజ్ రేవంత్ మీద సెటైర్ వేస్తాడు. మధ్యలో అరే ఆగు.. ఆగు నీవు అంటూ పక్కనే ఉన్న శ్రీహాన్ రాజ్ ని ఇమిటేషన్ చేస్తాడు. ఇంతలో ఓ బజర్ మోగుతుంది. నన్ని అని ఓ లెటర్ వస్తుంది. నన్ని అని నిన్ను పిలుస్తారు కదా అని ఇనయ రోహిత్ ను అంటుంది. దీంతో ఇంతలో రోహిత్ మమ్మి.. రోహిత్ డాడీ అని గేట్ వైపు ఎవరైనా వచ్చారేమో అని శ్రీసత్య పిలుస్తుంది. ఇంటి సభ్యులు అందరూ ఫ్రీజ్ అని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. అందరూ ఫ్రీజ్ అవుతారు. హౌస్ లోపల నుండి రోహిత్ మమ్మి వస్తుంది. వెనక నుండి ఎవరో వస్తున్నారని రాజ్ గుర్తు పడతాడు. రోహిత్ వాళ్ల మమ్మి ఇద్దరూ ఒకరిని ఒకరు కౌగిలించుకుని గట్టిగా ముద్దులు పెట్టుకుంటారు. తర్వాత అందరూ కూర్చోని ఎప్పటిలాగే కబుర్లు చెప్పుకుంటారు. ఫైమాకు సంబంధించిన ఏదో జోక్ చెప్తుంది రోహిత్ వాళ్ల మమ్మి. ఆదిరెడ్డి టాస్క్ కూడా టాస్క్ మస్తు ఉంటుంది అని పొగుడుతుంది. అలా కాసేపు ముచ్చటించిన ఆమె వెళ్లిపోవడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.