Bigg Boss Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ముందుగా ఫైమా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ గురించి చదివి వినిపిస్తుంది. ఈ వారం ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ బిబి కోచింగ్ సెంటర్ అని ఫైమా చెప్పగానే అందరూ సంతోషంతో నవ్వుతూ గోల చేస్తారు. ఆదిరెడ్డి డ్యాన్స్ టీచర్..ఫైమా ఇంగ్లీష్ టీచర్..అని..మగ, ఆడవారికి శ్రీసత్య మేకప్ టీచర్.. రోహిత్ పబ్లిక్ స్పీకింగ్..కీర్తి లాప్టర్ క్లమ్ ఇన్స్టక్టర్, ఇనయ ఫ్యాషన్ టీచర్, శ్రీహాన్ ప్రభావతంగా ఎలా ఫ్లర్ చేయాలో నేర్పాల.. రేవంత్ యోగా టీచర్..రాజ్ సింగింగ్ టీచర్ అని ఫైమా చెప్తుంది. వినోదాత్మకంగా టాస్క్ లు కొనసాగించాలని బిగ్ బాస్ ఆదేశాల్లో ఉంటుంది.
టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఫైమా ఇంగ్లీష్ టీచర్ గా చేసిన టాస్క్ ని చూప్తిస్తారు. ఏ ఫర్ యాపిల్.. బిఫర్ బాల్ అని బోర్డు మీద ఫైమా రాస్తుంది. చివరకు ఈ ఫర్ ఏం రాయాలో తెలీయ కలిపిరాత రాస్తుంది ఫైమా.. దీంతో మేడమ్ నీకు స్పెల్లింగ్ రాలేదు అని ఆదిరెడ్డి కామెడీ చేస్తాడు. ఫైమా అందరూ సైలెంట్ గా ఉండాలని చెప్తుంది.. లేదంటే ఐవిల్ కొడతా అని మిక్స్ ఇంగ్లీష్ లో అంటుంది. మేడమ్ మీకు కొడతా అనేది ఇంగ్లీష్ లో రాదా అని ఏం అంటారు టీచర్ అని రేవంత్ చిన్నపిల్లోడి మాదిరిగా ఆడుగుతాడు. ఐవిల్ బీటింగ్ అని ఫైమా అంటుంది. వెంటనే మేడం మీరు మాకు బీటింగ్ వేయోచ్చా అని రేవంత్ కాసేపు ఫైమాను ఆటపట్టిస్తాడు.

అలా ఫైమా టాస్క్ ఫన్నీగా ముగుస్తుంది. తర్వాత పాప ఏడ్చిన సౌండ్ వినపిస్తుంది. ఆదిరెడ్డి గేట్ వైపు చూడగానే తన భార్య కవిత పాపను ఎత్తుకుని హౌస్ లోకి అడుగుపెడుతుంది. ఆదిరెడ్డి కూతురు ఫస్ట్ బర్త్ డే సందర్భంగా అందరూ కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుతారు. ఐలవ్ యూ కవిత అని ఆదిరెడ్డి ఎంజాయ్ చేస్తాడు. కానీ మరోవైపు మాత్రం రేవంత్ కంట నీరు పెట్టుకుని బాధపడుతున్న విజువల్స్ చూపిస్తారు. కవిత హౌస్ లో నుండి వెళ్లిపోతుంది. టాస్క్ లోభాగంగా సెకండ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. శ్రీసత్య కూడా మేకప్ టీచర్ గా తోటి హౌస్ సభ్యులతో కలిసి ఫన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మధ్యలో రాజ్ వాళ్ల అమ్మ ఉమారాణి వస్తుంది. అందరూ మరలా సరదాగా గడుపుతారు. ఆమె మాట్లాడి వెళ్లిపోతుంది.
మరలా టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఆదిరెడ్డి డ్యాన్స్ మాస్టర్ గా టాస్క్ లో ఎంట్రీ ఇచ్చి ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. రాజ్ తో ముందుగా ఆదిరెడ్డి డ్యాన్స్ వేయిస్తారు. తర్వాత ఫైమా, శ్రీసత్య, ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరితో అందరితో డ్యాన్స్ చేయిస్తాడు ఆదిరెడ్డి. ఈ క్రమంలో అందరూ ఆదిరెడ్డితో కలిసి బాగా ఎంటర్ టైన్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.