Bigg Boss Review: బిగ్ బాస్ ఈ వారం వీకెండ్ ఎప్పటి మాదిరిగానే గ్రాండ్ గా సాంగ్ తో నాగార్జున ఎంట్రీ ఇస్తాడు. శుక్రవారం ఏం జరిగిందో చూద్దామని మన టివికి నాగ్ కనెక్ట్ చేస్తాడు. ఆదిరెడ్డి, అర్జున్ కి గీతూ, ఫైమా ఇద్దరూ కలిసి షేవింగ్ చేస్తారు. ఆ తర్వాత గీతై, రేవంత్ మధ్య బాలాదిత్య గురించి డిస్కషన్ జరుగుతుంది. వాసంతి, ఇనయ మధ్య జరుగుతున్న సంభాషణను చూపిస్తారు. లెన్స్ కార్డ్ ఫ్యాషన్ షో ప్రమోషన్ లో భాగంగా ఫ్యాషన్ షో కొనసాగుతుంది. తర్వాత నాగార్జన మన టీం ద్వారా కనెక్ట్ అవుతాడు.
ముందుగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా గేమ్ ఆడిన రెడ్ టీం, బ్లూటీం సభ్యులను డివైడ్ చేసి వారి గేమ్ మీద రివ్యూ చేయిస్తాడు. ముందుగా ఆదిరెడ్డి తన టీంలో ఎవరికి ఎన్ని మార్కులతో ర్యాంకింగ్ మెడల్స్ వేసి ఎందుకు అనేది వివరిస్తాడు. ఇందులో వాసంతి, ఇనయ, మెరీన గేమ్ తీరు పట్ల ఆదిరెడ్డి మంచి రివ్యూ ఇస్తాడు. నాగార్జున కూడా వారి ముగ్గురు ఆట తీరును మెచ్చుకుంటాడు. తర్వాత సిగరెట్ విషయంలో బాలాదిత్యకు నాగార్జున క్లాస్ పీకుతాడు.

గీతూను అన్న మాటలు తప్పుగా బాధతో అన్నాను.. స్మోకింగ్ అనేది నా వీక్ నెస్ కాదు.. నేను ఇప్పటి నుండి స్మోక్ ఆపేస్తున్నానని బాలాదిత్య ప్రకటిస్తాడు. ఆదిరెడ్డి టీం లీడర్ గా ఆడిన తీరును మెచ్చుకుంటాడు. తర్వాత ఆదిరెడ్డికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ గురించి అది జరిగిన వీడియోను ప్లే చూపిస్తాడు నాగార్జున. తర్వాత రెడ్ టీం సభ్యుల ఆట తీరు గురించి రివ్యూ స్టార్ట్ చేస్తాడు నాగార్జున. గీతూని వారి టీం సభ్యులకు ఇస్తున్న మార్కుల మెడల్స్ వేయమని చెప్పాడు. గీతూ వారి ఆట తీరును బట్టి మార్కులు ఇస్తుంది.
తర్వాత శ్రీహాన్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించిన తీరును గురించి నాగార్జున రివ్యూ చేస్తాడు. గీతూ తన పనిని ఆదిరెడ్డితో పని చేయించడం చూసి కూడా ఏమనకపోవడంపై శ్రీహాన్ ను నాగార్జున తప్పుబడతాడు. గీతూ చేత వాష్ రూమ్స్ క్లీన్ చేయించడంలో ఫెయిల్ అయినందుకు తర్వాత వారంలో కెప్టెన్సీ పోటీదారుడిగా పాల్గొనేందుకు అవకాశం లేదని నాగార్జున ప్రకటిస్తాడు. తర్వాత ఫుడ్ గురించి పెద్ద డిస్కషన్ జరుతుంది.
ఇక నామినేషన్స్ లో ఉన్న వాళ్లు లేచి నిల్చోమని చెప్తాడు బిగ్ బాస్.. మొదటి రౌండ్ లో ఆదిరెడ్డి సేఫ్ అవుతాడు. తర్వాత బ్లూ, రెడ్ టీంలో వరస్ట్ ఫర్మామర్స్ గీతూ, ఆదిరెడ్డి ఇద్దరూ ట్యాగ్స్ పెట్టుకుంటారు. తర్వాత మరలా ఎలమినేషన్ రెండో రౌండ్ స్టార్ట్ చేస్తారు. ఈ రౌండ్ లో కీర్తీ, రేవంత్ సేఫ్ అవుతారు. మిగతా వారిలో ఎలిమినేట్ ఎవరు అవుతారు అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దామంటూ ఈరోజు ఎపిసోడ్ ని నాగార్జున ముగిస్తాడు.