Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు 5 వ వారం కొనసాగుతోంది. నిన్న నామినేషన్స్ కార్యక్రమం పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. పులి, జింక లాంటి శ్రీహాన్, ఇనయలను కలిపి బేడీలు వేసినా కూడా వీరిద్దరూ కూడా సింపుల్‌గా తేల్చేశారు. ఏదో శ్రీహాన్ కాస్త యాటిట్యూడ్ చూపించాడనే టాక్ తప్ప రేటింగ్‌ను పెంచే హీటెడ్ నామినేషన్స్ మాత్రం లేవు. ఆసక్తికర విషయం ఏంటంటే.. చంటి, గీతూలకు కలిపి బేడీలు వేసినా కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. మరీ కామెడీ సీన్ అంటే.. అర్జున్, శ్రీ సత్యల మధ్య జరిగింది. ప్లీజ్ నామినేట్ అవ్వవా? అని బతిమాలుకోవడం మరింత కామెడీగా మారిపోయింది.
ఇక నిన్నటి నామినేషన్స్ ఎపిసోడ్ అట్టర్ ఫ్లాప్. బిగ్‌బాస్ గీసిన స్కెచ్ మాత్రం వర్కవుట్ అవకుండా చూడటంలో కంటెస్టెంట్స్ బాగా సక్సెస్ అయ్యారు. వెటకారంగా ఉన్నా కూడా ఇది నిజం. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. ఈ ప్రోమోలో బిగ్‌బాస్.. గలాటా గీతూను ఒక ఆట ఆడుకున్నాడు. ఇది చూస్తున్న వాళ్లకు కడుపుబ్బ నవ్వొచ్చింది. కాలికి వేస్తే.. మెడకు వేస్తూ.. మెడకేస్తే కాలికి వేస్తూ మొత్తానికి గీతూను బాగా ఆడుకున్నాడు. పైగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఫుల్ కామెడీగా..
Bigg boss 6 : బాలాదిత్య అన్న దీపు, దీపు అంటుంటే మండుతోంది బిగ్‌బాస్..
తొలుత బిగ్‌బాస్.. తన పుట్టిన రోజని కాబట్టి అంతా తనను ఎంటర్‌టైన్ చేయాలని సూచించాడు. ఎవరికి వారు తమ తోచినట్టుగా ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నించారు. అనంతరం గీతూని బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. అక్కడ గీతూతో అసలు గేమ్ స్టార్ట్ చేశాడు బిగ్‌బాస్. ఒక బౌల్‌లో చికెన్ పీస్ పెట్టి.. ‘గీతూ ఆ చికెన్ తినడానికి నీకు అర్హత లభించాలంటే.. ఇంటి సభ్యుల గురించి గాసిప్ చెప్పండి’ అని అడిగారు. అప్పుడు గీతూ.. ‘సూర్య, ఇనయ మధ్య ఏదో రగులుతోంది మొగలు పొద అనిపిస్తోంది’ అని చెప్పింది. ఈ గాసిప్‌తో చికెన్ వాసన చూడొచ్చని బిగ్‌బాస్ చెప్పారు. ఆ తరువాత.. బాలాదిత్య అన్న దీపు, దీపు అంటుంటే నాకు మండుతోంది బిగ్‌బాస్ అని చెప్పింది. అప్పుడు బిగ్‌బాస్.. అంత మంటతో ఈ స్పైసీ చికెన్‌ని తినగలరా? అని అడిగాడు. గీతూ ఆ.. అంటే.. వద్దులే గీతూ అని చెప్పి ఫుల్లుగా ఆడుకున్నాడు.