Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ మంగళవారం ఎపిసోడ్ కి సంబంధించి మొదటి ప్రోమో రిలీజ్ అయింది. నామినేట్ అయిన ఇంటి సభ్యులకు ఈ వారం బిగ్ బాస్ ఇమ్యునీటీని తగ్గించుకునే అవకాశం ఇస్తున్నాడని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. కానీ ఈ మొత్తం విన్నర్ యొక్క ప్రైజ్ మనీ నుండి తగ్గించడం జరుగుతుందని ప్రకటిస్తాడు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతారు.
ఏ సభ్యుల చెక్ అయితే ఎక్కువ యూనిక్ వ్యాల్యూతో ఉంటుందో వారు ఈ వారం నామినేషన్స్ నుండి సురక్షితులవుతారని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. దీంతో అక్క ఏర్పాటు చేసిన బాక్సులో ఇంటి సభ్యులు వారి అమౌంట్ ఎంతో రాసి వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫస్ట్ ప్లేస్ ఇచ్చేటట్టు లేరు కదా బిగ్ బాస్ ప్రతిసారి రెండో ప్లేస్ లో ఇస్తున్నారంటూ ఆదిరెడ్డి బిగ్ బాస్ ని తప్పుబడతాడు.

నామినేషన్స్ సభ్యులందరూ తాము రాసే ధరలు మిగతా ఏ ఇంటి సభ్యులతో చర్చించకూడదని బిగ్ బాస్ పెట్టిన రూల్ ని రేవంత్ చదివి వినిపిస్తాడు. ఎవరైతే ఈ హౌస్ లో ఎక్కువ అమౌంట్ రాసుకుని ఇమ్యునిటీ కోసం ట్రై చేస్తూ ఎక్కువ అమౌంట్ రాసుకుంటారో వారికి ఈ ఇంట్లో ఉండటానికి అర్హతే లేదని ఆదిరెడ్డి అభిప్రాయపడతాడు. అందరూ అమౌంట్ రాసి అక్కడ ఉన్న డబ్బాలో వేస్తారు.
ఈ వీక్ సేవ్ అవుతాను అన్న నమ్మకం ఉంది. అలాగే గెలుస్తానన్న నమ్మకంతో అమౌంట్ రాయడం జరిగిందని రేవంత్ అభిప్రాయపడతాడు. ఐదు లక్షలు ఎవరైనా ఇద్దరు రాశారు అనుకోండి పోతుంది. తర్వాత నాలుగు లక్షల తొంభై తొమ్మిదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎవరు రాసినా పోతుంది అని ఇనయ చెప్తుంది. మీరు చెక్స్ పై రాసే మొత్తాన్ని ఇంటి సభ్యులు ఎవరూ ఎవరితోనూ చర్చించకూడదని హెచ్చరించడం జరిగింది.. కానీ మిమ్మల్ని డిస్ క్వాలిఫై చేస్తున్నామని బిగ్ బాస్ ప్రకటించడంతో ప్రోమో ముగుస్తుంది. ఈ టాస్క్ లో ఎవరు ఎక్కువ అమౌంట్ రాస్తారు అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే..!